తప్పుడు హామీలతో బాబు దగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తప్పుడు హామీలతో బాబు దగా

తప్పుడు హామీలతో బాబు దగా

Written By news on Friday, May 15, 2015 | 5/15/2015


ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు హామీలిచ్చి మోసం చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. రెండోవిడత రైతుభరోసా యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గుంతకల్లు మండలం తివ్మూపురంలో మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు.డ్వాక్రా రుణాలన్నీ వూఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రూ.10 వేలను మూడు విడతల్లో రూ.3 వేల చొప్పున ఇస్తానంటున్న మాటలపై వారుమండిపడ్డారు. మహిళలతో సాగిన మాటామంతీ ఇలా....

జగన్: నీ పేరు ఏమిటమ్మా?
వెంకటలక్ష్మీ: నా పేరు వెంకటలక్ష్మీ. మాది తివ్మూపురం గ్రామం.

జగన్: ఎంత రుణం తీసుకున్నావమ్మా?
వెంకటలక్ష్మీ: 5 లక్షలు తీసుకున్నాను. రుణవూఫీ అని చెప్పినదానికి మేం రుణం కట్టలేదు. చంద్రబాబు నాయుుడుని తోలుకుని వచ్చి కట్టించుకోండి అని బ్యాంకోళ్లు అంటున్నారు. మేవుు చెప్పల్యా అంటున్నారు. బ్యాంకు మేనేజరు బుక్కు ఇసిరి పారేస్తాది. ఆయున ఎవరు...రావుయ్యు. ఆడోళ్లు గొడవ పెట్టుకోవద్దు అని అంటున్నాడు. అన్ని అవతారాలు చేస్తున్నారు. వాళ్లు జీవితంలో బాగుపడరు.
జగన్: నీ పేరేంటమ్మా? నువ్వు ఎంత రుణం తీసుకున్నావు?
ఉవు: నా పేరు ఉవు అన్న. రూ.5 లక్షలు ఉంది. వుుందే కట్టేసినాం. పొలం పెట్టి రూ.70 వేల రుణం తీసుకున్నాం. వూఫీ కాలేదు. పొదుపు గ్రూపు వాళ్లు ఇంతకు వుుందు బ్యాంకుకు పోతే మేడమ్, ఎవ్మూ అని పిలిచేవారు. ఇప్పుడు ఒవ్యూ....బయుటకు పో అంటున్నారు. దీనికి చంధ్రబాబే కారణం. వూ రుణాలు వూఫీ చేయువుంటే చేయుడు కానీ...సింగపూర్ చేస్తాడంట ఆయుప్ప.

జగన్: నీ పేరు ఏంటమ్మా? నీకు ఏం సవుస్యలు ఉన్నారుు తల్లి?
కవులవ్ము: నాకు రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇళ్లు కట్టుకున్నాను.
పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు అదిగో చందవూవు...ఇదిగో చందవూవు అని చెబుతుంటారు. అట్టే చంద్రబాబు కూడా తప్పుడు వూటలు చెప్పినాడు. వుూడు కంతులు వుూడు వేలు కట్టనందుకు ఇప్పుడు నాకు బ్యాంకోళ్లు రుణం కావాలంటే ఇవ్వడం లేదు.

జగన్: నీ పేరు ఏంటమ్మా? నీకు ఏమైనా రుణం ఉందా?
చంద్రకళ: ఆ ఉంది అన్న. బ్యాంకుల్లో రూ.3.9 లక్షల రుణం ఉంది. రుణవూఫీ అవుతాదని 6 నెలలు కట్టలేదు. దీనికి రూ.50 వేలు వడ్డీ అరుు్యంది. ఆయున రూ. 3 వేలు ఇస్తే ఏం లాభం? వడ్డీకి కూడా సరిపోదుకదన్న.

జగన్: బంగారు రుణాలు ఎవరికైనా ఉన్నాయూ? ఆక్షన్ నోటీసులు వస్తున్నాయూ?
పెద్దక్క: 2 తులాల బంగారం తాకట్టు పెట్టాను. రూ.35 వేల రుణం తీసుకున్నా. వూకున్న 4.80 ఎకరాల పొలం పెట్టి రూ.50 వేలు తీసుకున్నాం.

జగన్: రుణం మాఫీ ఏమైనా అరుు్యందా?
పెద్దక్క: ఏం కాలేదు సార్. బంగారం పెట్టినందుకు వేలం వేస్తావుని నోటీసులు వచ్చినారుు. అందుకే అప్పోసప్పో చేసి రుణం కట్టినాం.

జగన్: పెద్దమ్మా... నీ పేరు ఏంది? ఏం సవుస్య ఉంది?
భీవుక్క: నా పేరు భీవుక్క. నాకు పెన్షన్ రావడం లేదు. నా మొగుడు చచ్చిపోయూ. పింఛను వూత్రం ఇవ్వడం లేదు.
జగన్: పింఛన్ల కోసం ధర్నా చేద్దాం పెద్దమ్మా.
Share this article :

0 comments: