భూములు కొన్న నేతలతో లోకేశ్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూములు కొన్న నేతలతో లోకేశ్ భేటీ

భూములు కొన్న నేతలతో లోకేశ్ భేటీ

Written By news on Thursday, March 10, 2016 | 3/10/2016

♦ ‘సాక్షి’ వరుస కథనాలపై చర్చ
♦ అవకాశం దొరికినప్పుడల్లా కేసుల పేరుతో బెదిరించాలని ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కొన్న పార్టీ నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల, ఏలూరి సాం బశివరావు, ఎమ్మెల్సీ పయ్యావులతో పాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. రాజధాని భూ దురాక్రమణ పేరుతో ‘సాక్షి’ ప్రచురిస్తున్న వరుస కథనాలపై చర్చించారు. ఎవరెవరు ఎంత భూములు కొన్నారో ఆరా తీశారు.

అనంతరం ఈ కథనాలపై నేతలు స్పందించిన తీరును లోకేశ్ తప్పుపట్టారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా వివరణలు ఇచ్చుకున్నారని, అలా కాకుండా నేతలందరూ సమిష్టిగా తమతో పాటు ప్రభుత్వానిది ఏమాత్రం తప్పులేదని చెబితే బాగుండేదన్నారు. సాక్షి పత్రిక పై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేయాలని, కేసులు పెడతామని బెదిరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇలాఉండగా రాజధాని ప్రాంతంలో తాను భూములు కొన్నట్లు వచ్చిన వార్తలపై ఆ ప్రాంతానికి చెందిన నేతలు స్పందించకపోవటంపై లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ ప్రాంతంతో సంబంధం లేని వారు మాత్రం తన విషయంలో బాగా స్పందించారని లోకేశ్ అన్నట్లు సమావేశంలో పాల్గొన్న నేత ఒకరు చెప్పారు.
Share this article :

0 comments: