కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టండి: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టండి: షర్మిల

కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టండి: షర్మిల

Written By news on Sunday, June 3, 2012 | 6/03/2012

పోలవరం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: సొంత మామను వెన్నుపోటు పొడిచి, రైతులను పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, రాజశేఖరరెడ్డి అధికారమిస్తే దాన్ని చూసుకుని విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలను తరిమికొట్టాలని జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. పలు చోట్ల మాట్లాడుతూ.. ఐదు లక్షల మెజారిటీతో ఎంపీగా గెలవడమే జగనన్న తప్పా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండడమే జగనన్న చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఇదంతా పెద్ద కుట్రని, కాంగ్రెస్, టీడీపీ కలిసి సీబీఐని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాయని చెప్పారు. ‘నాన్నను మేమే చంపేశామట. రాజశేఖరరెడ్డి దయతో అధికారంలోకి వచ్చినవారే ఈ మాటలతో ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. మీరు వేసే ఓటుతో వారందరికీ బుద్ధి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. దేవుడు చూస్తున్నాడని, జగనన్న బయటకు వస్తాడని, సీఎం అవుతాడని ధీమా వ్యక్తంచేశారు.

ఎంత కష్టం వచ్చిందో ఆ తల్లికి..: మండుటెండను లెక్క చేయకుండా.. అలసటగా ఉన్నా పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను చూసి ప్రజలు చలించిపోతున్నారు. శనివారం పోలవరం నియోజకవర్గంలోని టి.నర్సాపురం, కొయ్యలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ఆమె రోడ్ షో నిర్వహించారు. 

ఆమెను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న జనం ఆమె ఈ వయసులో, ఎర్రటి ఎండలో తిరగడాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి భార్యకు ఎంత కష్టం వచ్చిందో, పాపం అంటూ మహిళలు చర్చించుకోవడం కనిపించింది. విజయమ్మ శనివారం పోలవరం నియోజకవర్గంలోని మక్కినవారిగూడెం, టి.నర్సాపురం, బొర్రంపాలెం, మల్లుకుంట, తిరుమలదేవిపేట, రాజవరం, కొయ్యలగూడెం, బయ్యనగూడెం తదితర గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ప్రతి చోటా జనం ఆమెను చూసేందుకు పోటీపడ్డారు. ఎండను లెక్క చేయకుండా రోడ్లపైనే నిరీక్షించారు. ఆమె వచ్చినప్పుడు గ్రామాలకు గ్రామాలే కదిలి రోడ్లపైకి వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో విజయమ్మ వెంట పోలవరం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తెల్లం బాలరాజు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే చెరకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: