సీమాంధ్రుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోరా?:షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీమాంధ్రుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోరా?:షర్మిల

సీమాంధ్రుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోరా?:షర్మిల

Written By news on Wednesday, September 4, 2013 | 9/04/2013

శ్రీమతి షర్మిల సమైఖ్య శంఖారావం

అనంతపురం: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఈ సాయంత్రం ఆమె  హిందూపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే అభివృద్ధి ఆగిపోదా? విభజనతో ఈ రాష్ట్రం ఎడారిగా మారిపోదా? అని అడిగారు. పక్కరాష్ట్రాల ప్రాజెక్ట్‌లతో నీళ్లు లేక ఇప్పటికే సతమతమవుతున్నామన్నారు.

సొంతమామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలో లెక్కా అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష నేత అయ్యుండి రాష్ట్ర విభజనకు బ్లాంక్‌ చెక్‌లాంటి లేఖ ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోండని  చంద్రబాబును కోరారు. 9 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని దండగ చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు అధికారం ఇమ్మంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ వైపు రాష్ట్రాన్ని చీల్చాలంటూ, మరోవైపు బస్సుయాత్ర చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి  పాలనలో సువర్ణయుగం నడిచిందని గుర్తు చేశారు. ఏ ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన చేశారన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ అద్భుతంగా అమలు చేశారని తెలిపారు.  ఇప్పుడున్న కిరణ్ సర్కార్ అన్ని ఛార్జీలు పెంచిందన్నారు.  పేదవాడు ఛార్జీలు కట్టలేక చతికిలపడుతుంటే కాంగ్రెస్ నవ్వుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిప్పుపెట్టి కాంగ్రెస్ చలి కాచుకుంటోందని షర్మిల మండిపడ్డారు.
Share this article :

0 comments: