అన్ని పార్టీల వాళ్లూ జెండాలు పట్టుకుని ఉద్యమంలోకి రండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్ని పార్టీల వాళ్లూ జెండాలు పట్టుకుని ఉద్యమంలోకి రండి

అన్ని పార్టీల వాళ్లూ జెండాలు పట్టుకుని ఉద్యమంలోకి రండి

Written By news on Friday, October 4, 2013 | 10/04/2013

పార్టీ జెండాలు పట్టుకునే ఉద్యమంలోకి రండి
పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ను ఇంత దారుణంగా విభజిస్తుంటే దేశం మొత్తం చూస్తూ ఊరుకుందని, రాష్ట్రమంటే అంత చులకనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి ప్రశ్నించారు. ఇది మారాలని, రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరన్న చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లోటస్ పాండ్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజిస్తే రేపు కృష్ణా ఆయకట్టులో అనేక గొడవలు రోజూ జరుగుతాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం అవతలివైపున్న జిల్లాలు మాత్రమే కాదని, ఇవతలవైపు మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. పదేళ్లలో హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలంటున్నారని, హైదరాబాద్ నగరాన్ని నిర్మించడానికి 60 ఏళ్లు పట్టినప్పుడు కేవలం పదేళ్లలో మరో హైదరాబాద్ లాంటి నగరాన్ని అక్కడ నిర్మించగలరా అని జగన్ నిలదీశారు.

విభజనకు వ్యతిరేకంగా తాను రేపటినుంచి చేపట్టబోతున్న ఆమరణ నిరాహార దీక్షకు అన్ని పార్టీలూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేవలం మూడు పార్టీలు మాత్రమే సమైక్యాంధ్రకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, మిగిలిన వాళ్లు కూడా ముందుకు రావాలని కోరారు. అన్ని పార్టీల నాయకులూ వాళ్ల జెండాలు పట్టుకునే ఈ ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. ఇలాంటి తరుణంలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని, ఉద్యమంలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా ఆయన కోరారు. పార్టీలు, అధ్యక్షులలో నిజాయితీ ఉండాలని స్పష్టం చేశారు.

రేపు ఇదే పరిస్థితి కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా రావచ్చని, కేవలం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం ఇలా హృదయాలను చీల్చడం సరికాదని జగన్ చెప్పారు. చదువుకున్న పిల్లలు రేపు ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలని నిలదీశారు. భావి తరాలు సర్వనాశనం కాకుండా ఉండాలంటే మనమంతా పోరాడాలని పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: