కాంగ్రెస్‌కు షాక్.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌కు షాక్..

కాంగ్రెస్‌కు షాక్..

Written By news on Monday, December 23, 2013 | 12/23/2013

కాంగ్రెస్‌కు షాక్..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొన్నినెలలుగా స్తబ్ధుగా ఉన్న జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. పెద్ద సంఖ్య లో సాలూరు నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో హైదరాబాద్ వెళ్లిన ఆయన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రాజన్నదొర చాలా రోజుల కిందటే వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు తక్షణ మే రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించి కాంగ్రెస్‌లోనే కొనసాగేలా చేశారు. 
 
 అంతేకాకుండా గిరిజన సంక్షేమానికి సంబంధించి శాసన సభా కమిటీకి ఆయనను చైర్మన్‌గా నియమించారు.  దీంతో  విధిలేని పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారు. అయితే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉన్న రాజన్నదొర ఎప్పటికైనా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో నడవడం తథ్యమని ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పూర్తి నమ్మకంతో ఉండేవారు. ఇదే విషయమై ఆయనపై ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవారు. కార్యకర్తల అభీష్టం మేరకు  రాజన్న దొరతోబాటు సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జరజాపు ఈశ్వరరావు కూడా పార్టీలో చేరారు.  
 
 సుజయ్ కృష్ణ చాణక్యం...
 వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు  రాజ కీయ చాణక్యాన్ని ప్రదర్శించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలేలా చేశారు. మంత్రి బొత్స సత్తిబాబు ఎత్తులను ఎదుర్కొంటూనే రాజన్న దొరను పార్టీలోకి తీసుకురావడానికి ఆయన తెరవెనుక మంత్రాంగం నడిపారు. చివరకు తాను అనుకున్నట్లుగానే దొరను తీసుకెళ్లి పార్టీలో చేర్చి తన పెద్దరికాన్ని నిరూపించుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని నిలువుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర జిల్లాల్లో పుట్టగతులుండవని కాంగ్రెస్ కార్యకర్తలు బాహాటంగానే అంగీకరిస్తున్నా రు. ఇలాంటి తరుణంలో సమైక్యాంధ్రకు కట్టుబడి అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకోవాలని పలువురు ఆరాట పడుతున్నారు. 
Share this article :

0 comments: