దేశ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీదే కీలకపాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేశ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీదే కీలకపాత్ర

దేశ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీదే కీలకపాత్ర

Written By news on Tuesday, December 24, 2013 | 12/24/2013

దేశ రాజకీయాల్లో వైఎస్సార్ సీపీదే కీలకపాత్ర: ఎంపీ మేకపాటి
నెల్లూరు: దేశ రాజకీయాల్లో వైఎస్‌ఆర్‌సీపీనే కీలకపాత్ర వహిస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారని, అందుకే రాష్ట్ర విభజనకు సోనియా గాంధీ కృషి చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.

నెల్లూరు జిల్లాలోని జనతాపేట వైకుంఠపురంలో కావాలి సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: