పి.ఆర్. కిరణ్‌ కుమార్ రెడ్డి గారికి నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పి.ఆర్. కిరణ్‌ కుమార్ రెడ్డి గారికి నివాళి

పి.ఆర్. కిరణ్‌ కుమార్ రెడ్డి గారికి నివాళి

Written By news on Thursday, December 26, 2013 | 12/26/2013

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోశాధికారి పి.ఆర్. కిరణ్‌ కుమార్ రెడ్డి చనిపోయి ఈరోజుకి సంవత్సరం అవుతుంది. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా దామర మడుగు. చిన్నతనం నుంచే సేవాతత్వం కలిగిన కిరణ్‌ కుమార్‌ రెడ్డికి దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖర రెడ్డితో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన వైయస్ఆర్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆరోగ్యశ్రీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. సీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి రోగులకు సాయం అందించారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎంకు వివిధ సమస్యలపై వచ్చే అర్జీలు స్వీకరించడం, వాటిని క్రోడికరించడంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎనలేని కృషిచేశారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి సేకరించిన సమాచారమే నిరుపేదలకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు అందించే ఆరోగ్య భద్రత పథకం రూపకల్పనకు దోహదం చేసిందని అంటారు . ఆయన సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఏదైనా చేయాలని నిర్ణయించారని, దేశవిదేశాల్లోనూ విశేష ప్రసంశలు పొందిన ఈ సంక్షేమ పథకం అమలు‌ బాధ్యతను కిరణ్‌ కుమార్ స్వయంగా తన భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పవచ్చు .


వైయస్ఆర్ సి‌పి లో తనదైన పాత్ర పోషించి అందరికీ ఆప్తుడిగా మెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి గారు  లేని లేటు తీర్చలేనిది.దేవుడు ఆయన కుటుంబానికి మేలు చేయాలని కోరుకుందాం ...Share this article :

0 comments: