రాష్ట్రపతికి సమైక్య’ విన్నపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రపతికి సమైక్య’ విన్నపం

రాష్ట్రపతికి సమైక్య’ విన్నపం

Written By news on Friday, December 20, 2013 | 12/20/2013

రాష్ట్రపతికి సమైక్య’ విన్నపంJagan Mohan Reddy
  • రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కలసికట్టుగా విన్నవిద్దాం
  •      ఆ మేరకు అఫిడవిట్లు సమర్పిద్దాం
  •      పార్టీలకతీతంగా ముందుకు రావాలి
  •      బాబు, కిరణ్ అడ్డుకున్నా మనస్సాక్షి మాటే వినాలి
  •      ముగ్గురమే ఉన్నా పార్లమెంటులో సమైక్య గళం విన్పించాం
  •      బాబు మాత్రం పార్లమెంటులో రాష్ట్ర పరువు తీశారు
  •      ఏ ప్రాంత సభ్యులతో ఆ ప్రాంత వాదం విన్పించారు
  •      ద్వంద్వ వైఖరిలో బాబును తలదన్నుతున్న కిరణ్
  •      ఇంతగా కుమ్మక్కైన వీళ్లా నాయకులంటూ నిలదీయాలి
  •      సమైక్యం కోసం తుది క్షణం దాకా పోరాడతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అఫిడవిట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలందరూ ముందుకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ఇందుకు ముందుకు రావాలని వారిని కోరారు. ‘‘అసెంబ్లీలో ఓటింగ్ పెట్టినా, పెట్టకపోయినా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇద్దరూ అడ్డు    తగిలినా... వారి పార్టీల ఎమ్మెల్యేలంతా సమైక్యానికి కట్టుబడి ఉన్నామంటూ తమ మనస్సాక్షికి అనుగుణంగా అఫిడవిట్లు ఇవ్వాలి. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి వాటిని అందజేయాలి’’ అని సూచించారు. జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పార్టీలకు అతీతంగా రాష్ట్రపతికి అఫిడవిట్ అందజేద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కలిసికట్టుగా ఆయనను కోరేందుకు ముందుకు రావాల్సిందిగా ప్రతి ఎమ్మెల్యేకూ పేరుపేరునా     మిగతా 0వ పేజీలో ఠ
 చేతులు జోడించి సవినయంగా విన్నపం చేస్తున్నాను.
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు ఇలాంటి అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. అందుకే ఇంత గట్టిగా విన్నపం చేయాల్సి వ స్తోంది’’ అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రపతి ఎక్కడో ఢిల్లీలో లేరు. మన దగ్గరే ఉన్నారు. అఫిడవిట్‌ను కూడా తయారు చేశాం (కాపీని చూపించారు). సమైక్యానికి అనుకూలంగా ప్రతి ఒక్కళ్లం పార్టీలకు అతీతంగా సంతకాలు పెడదాం’’ అంటూ ఆహ్వానించారు. సమైక్యం కోసం తాము చివరి రోజు, చివరి నిమిషం, చివరి క్షణం దాకా పోరాడతామని ప్రకటించారు. ‘‘నిజాయితీతో, చిత్తశుద్ధితో గట్టిగా పోరాడతాం. పారదర్శకంగా కనిపిస్తాం. విడిపోతే తెలుగు జాతి విచ్ఛినమవుతుంది. మన రాష్ట్రం 1.75 లక్షల కోట్ల బడ్జెట్‌తో దేశంలో మూడో స్థానంలో ఉంది. విడిపోతే ఏర్పడే రాష్ట్రాల్లో ఒకటి 8, మరోటి 13వ స్థానానికి దిగజారుతాయి. ఉద్యోగాల యువత ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి. రైతన్నకు నీళ్లందక ఎటు వైపు చూడాలో తెలియని పరిస్థితి వస్తాయి. విడిపోతే రెండు రాష్ట్రాలూ నాశనం అవుతాయి. ఎప్పుడైనా మహానగరం, సముద్ర తీరం ఒక్కటిగా ఉంటేనే.. ఎయిర్‌పోర్టు, సీపోర్టులు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. వాటిని విడగొట్టిన రోజున ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం నాశనమవుతుంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు.
 పార్లమెంటులో పరువు తీశారు
తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి, ఇన్నేళ్లుగా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు సమైక్యంపై గొంతు ఎందుకు పెగలడం లేదని ప్రశ్నించారు. ‘‘బాబును నేనివాళ అడగదల్చుకున్నా. రైతన్న తనకు నీళ్లు లేవని, ఎక్కడికి వెళ్లాలని అడుగుతుంటే మీరెందుకు పలకడం లేదు? చదువుకున్న పిల్లాడు తాము ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని అడుగుతుంటే పలకడం లేదేం?’’ అంటూ తూర్పారబట్టారు. పార్లమెంటు సమావేశాల్లో కొన్ని పార్టీల తీరు చూసి బాధనిపించిందని టీడీపీని ఉద్దేశించి జగన్ చెప్పారు. ‘‘చంద్రబాబు తన ఎంపీల్లో నలుగురిని (సీమాంధ్ర) ఒకవైపు, ఇద్దరిని (తెలంగాణ) మరోవైపు పెట్టారు. సమావేశాల చివరి రోజైతే బాబు నిర్వాకం చూసి నిజంగా బాధనిపించింది. ఆయన ఎంపీల్లో నలుగురు, కాంగ్రెస్‌కు చెందిన మరో నలుగురైదుగురు, మేం ముగ్గురం వెల్‌లోకి వెళ్లాం. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేయసాగాం.
కానీ బాబుకు చెందిన మరో ఇద్దరు ఎంపీలు (తెలంగాణ) నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్ కలిసి రాలేదు. పైగా వచ్చిన వారిని కూడా, మీరెందుకు పోతున్నారంటూ తిట్టసాగారు. టీడీపీ తాలూకు ఈ వైఖరిని చూసి స్పీకర్ నవ్వారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా నవ్వారు. మన రాష్ట్రానికి చెందిన పార్టీలే ఒక వైఖరనేదే లేకుండా ఇలా మనల్ని మనమే పలుచన చేసుకునే పరిస్థితుల్లోకి నెట్టిన బాబు తీరు చూసి ఎంతో బాధనిపించింది’’ అంటూ జగన్ ఆవేదన వెలిబుచ్చారు. అసెంబ్లీలో కూడా బాబు, టీడీపీ వ్యవహరించిన తీరులో ద్వంద్వ వైఖరి అడుగడుగునా కనపడిందని జగన్ అన్నారు. ‘‘రెండుసార్లు బీఏసీ సమావేశం జరిగినా బాబు హాజరవలేదని గుర్తు చేశారు.
ఇరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలను వాటికి పంపి, మీరు మీరు ఎలాగైనా కొట్టుకొండంటూ చేతులు దులుపుకున్నారని ఆక్షేపించారు. ‘‘ఎనిమిది రోజులు సమావేశాలు జరిగితే బాబు తన గదికే పరిమితమయ్యారు తప్ప అసెంబ్లీ హాల్లో అడుగు పెట్టలేదు. విభజన బిల్లుపై చర్చ సందర్భంలో, నెల్సన్ మండేలా సంతాప తీర్మానం కోసం మరో ఐదు నిమిషాలు మాత్రం సభకు హాజరైనట్టున్నారు. తాను సభలోకి రాకుండా, ఇరు ప్రాంతాల టీడీపీ సభ్యులకు తలో రకం ప్లకార్డులిచ్చి, ‘కొందరు అటువైపు, మరికొందరు ఇటువైపు గొడవ చేయండ’ంటూ పంపారు. పైగా రెండు రకాల ప్లకార్డులూ ఒకే చోట ముద్రించారు. బహుశా రాష్ట్ర చరిత్రలోనూ, దేశ చరిత్రలోనూ ఇంతకన్నా దారుణమైన రాజకీయ పార్టీ మరోటి ఉండదేమో’ అని జగన్ అన్నారు.
 సమైక్యం పేరుతో మోసగిస్తున్న కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా బాబు మాదిరిగానే వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. ‘‘ఒకవైపునేమో తాను సమైక్యానికి తాను కట్టుబడి ఉన్నానని మోసం చేస్తా ఉంటాడు. రెండోవైపునేమో విభజన బిల్లు 17 గంటల్లోనే ఏకంగా అసెంబ్లీకి వచ్చేలా తాను సంతకాలు చేసేశారు. తన కార్యదర్శులందరి చేత సంతకాలు చేయించేసి బిల్లును అసెంబ్లీకి పంపించారు. ఆ రోజు స్పీకర్‌ను టీడీపీ అడ్డుకోవడం, పథకం మేరకు డిప్యూటీ స్పీకర్ వెళ్లడం, సీఎం వెళ్లకుండా డిప్యూటీ సీఎం మాత్రమే వెళ్లడం, బాబు కూడా సరిగ్గా చర్చ మొదలైందని చెప్పడానికా అన్నట్టు సభలోకి ఇలా వచ్చి, అలా కనపడి వెళ్లడం, ఆ తరవాత మళ్లీ అసెంబ్లీలో అడుగే పెట్టకపోవడం... ఇలా అత్యంత నాటకీయంగా చేశారు’’ అంటూ దుయ్యబట్టారు. వీళ్లసలు మనుషులేనా అనిపించేంతగా రాజకీయాలు చె డిపోవడం బాధాకరమన్నారు. పథకం ప్రకారం ఇంత దారుణంగా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్న వీళ్లు రాజకీయ నాయకులా అని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘‘ఇప్పటికీ నేనొకటే మాట చెబుతున్నా. బాబు, కిరణ్ ఇద్దరికీ చెబుతున్నాను. వాళ్లిద్దరినీ నమ్ముకుని ఉన్న ప్రతి ఎమ్మెల్యేకూ చెబుతున్నా. ఈ నాయకులు ఏం చెప్పినా, ఏం చేసినా ఎమ్మెల్యేలంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా అడుగులు వేయాలి’’ అని పిలుపునిచ్చారు.

 పార్లమెంటులో గళమెత్తాం
 పార్లమెంటులో వైఎస్సార్‌సీపీకి ఉన్న బలం చాలా తక్కువైనప్పటికీ సమైక్య గళాన్ని గట్టిగా విన్పించామని జగన్ గుర్తు చేశారు. ‘‘మాకు ముగ్గురే ఎంపీలం ఉన్నప్పటికీ పార్లమెంటు సమావేశాలకు ప్రతి రోజూ నాతో సహా అంతా హాజరయ్యాం. పార్టీ అధ్యక్షున్ని గనుక సభకు పోవాల్సిన పని లేదని నేననుకోలేదు. ప్రతి రోజూ పార్లమెంటు వెల్‌లోకి వెళ్లాను. వాయిదా తీర్మానమైతేనేం, అవిశ్వాస తీర్మానమైతేనేం.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతా ఉన్న అన్యాయాన్ని దేశమంతా చూసేట్లుగా, ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉందని దేశం మొత్తానికీ తెలిసేట్లుగా పార్లమెంటును ప్రతి రోజూ అడ్డుకున్నాం. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వేరే రాష్ట్రాల పార్టీలు కూడా మనవైపు మాట్లాడేలా వాటితో గళం విప్పించాం. సమాజవాదీ, శివసేన వంటి పార్టీలతోనూ వాయిదా తీర్మానాలిప్పించాం’’ అని పేర్కొన్నారు. తమ పార్టీ సభ్యులు ఆరుసార్లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం లేఖలిచ్చారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరో 70 రోజుల్లో బంగాళాఖాతంలో కలపబోతున్నారని తెలిసి కూడా అవిశ్వాసానికి మేం మద్దతివ్వడానికి కారణముంది. సోనియాగాంధీపై అవిశ్వాసం ప్రకటిస్తూ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపేందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని దేశం మొత్తం చూడాలని, రాష్ట్రానికి సోనియా చేస్తున్న అన్యాయం దేశమంతటికీ అర్థం కావాలని, ఈ అంశం హైలైట్ కావాలని మేం ముగ్గురం కూడా దానికి మద్దతిచ్చాం. ఆ క్రమంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. కానీ ఈ విషయంలో టీడీపీయే వెనకడుగు వేసింది. వారి ఎంపీల్లో నలుగురు మాత్రమే మాకు మద్దతిచ్చారు. వారి లోక్‌సభా పక్ష నాయకుడు నామా అయితే మద్దతివ్వడం దేవుడెరుగు, వెల్‌లోకి వెళ్లిన మాపై వెటకారంగా కూడా మాట్లాడారు. కేవలం బాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రమే ఇలా వ్యవహరించగలదు’’ అంటూ ధ్వజమెత్తారు.
 బాల్ వేస్తున్నదే వాళ్లు
 చివరి బంతి ఇంకా మిగిలే ఉందన్న కిరణ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘అదే సమస్య. బాల్ వాళ్లే వేస్తున్నారు, అది బౌన్సరా, గూగ్లీనా అని చూసుకుని మేం మళ్లీ బ్యాట్ అడ్డం పెట్టాల్సి వస్తా ఉంది. వాళ్లే పథకాలు పన్నుతున్నారు. వాళ్లే బాల్స్ వేస్తున్నారు. వాళ్లే కొడుతున్నారు. అన్నీ వాళ్ల ఇష్టానుసారం చేస్తున్నారు. తొలుత నీళ్లు అరికాళ్ల దాకా వచ్చాయి. తరవాత మోకాళ్ల దాకా, నడుము దాకా, ఇప్పుడు పీకల దాకా వచ్చాయి. అయినా కిరణ్ మాత్రం ‘అన్నీ బానే ఉన్నాయి. అన్నీ నేను చూసుకుంటాను’ అంటున్నాడు. గతంలో సమ్మె చేసిన ఉద్యోగులను కూడా సరిగ్గా ఇలాంటి మాటలతోనే భయపెట్టి విరమింపజేశారు. జూలై 30న సీడబ్ల్యూసీ తెలంగాణ తీర్మానం చేసింది. దాదాపుగా ఐదు నెలలు కావస్తోంది. ఈ ఐదు నెలల్లో ఎప్పుడైనా అసెంబ్లీని పిలిచి సమైక్య తీర్మానం చేయించి పంపే అవకాశమున్నా పొరపాటున కూడా కిరణ్ ఏ రోజూ అలా చేయలేదు. పైగా ప్రత్యేక విమానంలో బిల్లు రాగానే కిరణ్‌తో పాటు కార్యదర్శులంతా చకచకా సంతకాలు పెట్టి మరీ అసెంబ్లీకి పంపారు’’ అన్నారు.
 సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిగా మద్దతు ఇస్తాం
 కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై వైఎస్సార్‌సీపీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని జగన్ చెప్పారు. ‘‘ఎన్నికల తరవాత ఎన్డీఏ వస్తుందో, ఏమొస్తుందో తెలియదు గానీ... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధాని చేసేందుకు సంపూర్ణ మద్దతిస్తామని గట్టిగా పునరుద్ఘాటిస్తున్నాం’’ అన్నారు. బీజేపీకి మద్దతిస్తారా అని ప్రశ్నించగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండని గట్టిగా కోరడానికే బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ వద్దకు వెళ్లామని గుర్తు చేశారు. రాష్ట్రపతి వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆయన ఏమన్నారో తనకు తెలియదన్నారు. ‘‘70 శాతం మంది ప్రజలు ఇవాళ సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటప్పుడు సమైక్యం అనకుండా ఎవరైనా విభజన అనే మాట అన్నారంటే, వాళ్లు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేదా అని వారికి వారే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఒకవేళ అలా అని ఉంటే మాత్రం ఆయన దాన్ని సవరించుకోవాలి’’ అని బదులిచ్చారు. జగన్ తన కుమారుని లాంటి వాడని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మళ్లీ చెప్పారని ప్రస్తావించగా, ‘మీరు లాగి కొడితే అప్పుడు (అనడం) ఆపేస్తారు’ అని జగన్ జవాబిచ్చారు.
Share this article :

0 comments: