సమైక్యతీర్మానం కోసం పట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్యతీర్మానం కోసం పట్టు

సమైక్యతీర్మానం కోసం పట్టు

Written By news on Tuesday, December 17, 2013 | 12/17/2013

సమైక్యతీర్మానం కోసం పట్టుపట్టిన వైఎస్ఆర్ సిపి
హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనను ప్రభుత్యం అంగీకరించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశం నుంచి  వాకౌట్ చేశారు.  బిఏసి సమావేశం నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. సమైక్య తీర్మానం కోసం తాము పట్టుపట్టినట్లు ఆమె తెలిపారు.

సమైక్య తీర్మానం తరువాతే అసెంబ్లీలో చర్చ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంతకు ముందు  రాష్ట్రాల విభజన సమయంలో ఏ నిబంధనలైతే పాటించారో అవే నిబంధనలు పాటించాలని తాము కోరినట్లు తెలిపారు. సమైక్య తీర్మానానికి అంగీకరించనందున తాము వాకౌట్ చేసినట్లు చెప్పారు. తుపానును అడ్డుకోలేకపోయాను, విభజనను ఆపుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  ప్రగల్భాలు పలికారని విమర్శించారు.

ఇదిలా ఉండగా, టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు కూడా (బిఏసి) సమావేశం నుంచి  వాకౌట్ చేశారు. సీఎం కూడా సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.  
Share this article :

0 comments: