Jagan Magic - Android Game - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Jagan Magic - Android Game

Written By news on Saturday, April 19, 2014 | 4/19/2014


https://play.google.com/store/apps/details?id=com.dexati.jaganmagic

ఇంటర్నెట్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లను విరివిగా ఉపయోగించుకుంటూ, ముఖ్యంగా యువతతో ఎక్కువగా కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఉపయోగించుకుంటున్న పార్టీలు తమ విజయంకోసం ఇంటర్నెట్‌ ప్రచారంలో ప్రత్యర్థ పార్టీలకంటే ఒక అడుగు ముందే ఉన్నామని నిరూపిస్తున్నారు. అది పార్టీ ప్రచారమైనా, సంక్షేమ పధకాలను వివరించే పనైనా, వైరివర్గాలను తూర్పారపట్టడానికైనా నిర్ణయాత్మకమైనపాత్ర పోషిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు వాడుకుంటున్నారు.
ఈ విషయంలో రాష్ట్రంలోని కొన్ని పార్టీలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ జాతీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి. ఇదే కోవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ‘జగన్ మేజిక్’ అనే ఆండ్రాయిడ్ గేమ్ ని రూపొందించి గూగుల్ ప్లేస్టోర్ లో ఉంచారు. ఈ గేమ్ లో మొత్తం పదిహేను స్టేజీలు ఉంటాయి. 
ఒక్కొక్క జిల్లాని ఒక స్టేజి గా, తెలంగాణా మొత్తాన్ని ఒక స్టేజిగా మరియు ఆఖరి స్టేజిగా ఇండియాను ఉంచారు. అంటే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక్క జిల్లాలో వోట్లని కలెక్ట్ చేసుకుంటూ తర్వాత తెలంగాణా, ఇండియా స్టేజి దాకా వెళ్ళేటట్లు రూపొందించారు. రెండు రాష్ట్రాల్లో జగన్ నిర్ణయాత్మకమైన పాత్ర పోషించడమే కాకుండా కేంద్రంలో కీలక పాత్ర పోషించడం తథ్యమని దానిని ఈ గేమ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశామని వెల్లడించారు.
ఈ క్రింద ఇచ్చిన లింక్స్ లో ‘జగన్ మేజిక్’ ఆండ్రాయిడ్ గేమ్ ను చూడవచ్చు.




Jagan Magic - screenshotJagan Magic - screenshot
Share this article :

0 comments: