రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి

రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి

Written By news on Monday, July 14, 2014 | 7/14/2014

టీడీపీ దుర్మార్గాలను అడ్డుకోండి: వైఎస్సార్‌సీపీ
* రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి
* ‘దేశం’ నేతల దౌర్జన్యంపై ఫిర్యాదు

 
 సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల్లో అధికార టీడీపీ సాగిస్తున్న అరాచకాలు, దుర్మార్గాలను అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా తమ పార్టీకి చెందిన మైనారిటీ ఎమ్మెల్యే ముస్తఫా, సీనియర్ నేత అంబటి రాంబాబులపై దౌర్జన్యం చేసి, ఎంపీటీసీలను అపహరించుకు వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట రంగారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన విషయాన్ని కూడా పార్టీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, కేంద్ర పాలకమండలి సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, సంస్థాగత వ్యవహారాల కో ఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్, ప్రకాశం జిల్లా నేత భవనం శ్రీనివాసరెడ్డి ఆదివారం ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆయన ఇంటి వద్ద కలుసుకుని రెండు వేర్వేరు ఫిర్యాదులు అందజేశారు.
 
 మార్కాపురం డీఎస్‌పీ రామాంజనేయులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడికి లొంగి వెంకట రంగారెడ్డిని అరెస్టు చేశారని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక కార్యక్రమానికి వెళుతున్న తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని, అదే సమయంలో పార్టీ నేతలపై దాడులకు పాల్పడ్డారని నేతలు తెలిపారు. నవీన్ మిట్టల్‌తో భేటీ అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏడాది కిందటి పాత కేసును సాకుగా చూపి రంగారెడ్డిని అరెస్టు చేరుుంచడం టీడీపీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అధికార పార్టీ ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేకంటే పదవులకు నామినేట్ చేసుకుంటే సరిపోతుందని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారమదంతో స్థానిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.
 
 నేతలకు జగన్ పరామర్శ
 అంబటి రాంబాబుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ఎమ్మెల్యే ముస్తఫాతో కూడా మాట్లాడారు. టీడీపీ దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడాలని, పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: