వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ రాళ్లదాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ రాళ్లదాడి

వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ రాళ్లదాడి

Written By news on Tuesday, July 15, 2014 | 7/15/2014

పెనుకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారు. సోమవారం రోజున అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని బండ్లపల్లిలో వైఎస్ఆర్ కార్యకర్తపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసిన సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంజనప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్లదాడి సమయంలో అంజనప్ప కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు లోనవ్వడమే కాకుండా.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారని అంజనప్ప మీడియాకు తెలిపారు. తన ఇంటిపై దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై అంజనప్ప స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 
Share this article :

0 comments: