
శ్రీకాకుళం: ఆదర్శ రైతుల కొనసాగింపుపై పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ ను 500 ఆదర్శ రైతులు కలిసి తమ గోడును చెప్పుకున్నారు.
శ్రీకాకుళం మండలం కరజాడ వద్ద వైఎస్ జగన్‌ను శుక్రవారం మధ్యాహ్నం ఆదర్శ రైతులు కలిశారు. జిల్లాలోని ఆదర్శ రైతుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యలను రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని వైఎస్ జగన్ రైతులకు భరోసానిచ్చారు.
0 comments:
Post a Comment