రౌడీషీట్లతో రాక్షస పాలన: జ్యోతుల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రౌడీషీట్లతో రాక్షస పాలన: జ్యోతుల

రౌడీషీట్లతో రాక్షస పాలన: జ్యోతుల

Written By news on Sunday, November 2, 2014 | 11/02/2014

 ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించడం, రౌడీషీట్లు పెట్టడం ఏపీ సీఎం చంద్రబాబు రాక్షసపాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు రౌడీ రాజ్యాన్ని స్థాపించాలని చూస్తున్నారన్నారు. ఆ ప్రయత్నాన్ని తమ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు.

తమ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్‌కె రోజాపై అక్రమ కేసులు పెట్టి వేధించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచీ ప్రతిపక్షాన్ని నిర్మూలించాలని చూస్తున్నారని జ్యోతుల అన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టారని, దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అడ్డుకోవడమే కాకుండా ఆమెపైనే కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు.
Share this article :

0 comments: