బాబు మోసకారి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు మోసకారి

బాబు మోసకారి

Written By news on Tuesday, November 4, 2014 | 11/04/2014


బాబు మోసకారి
 పీఎన్‌కాలనీ : ఎన్నికల సమయంలో రుణమాఫీ పేరుతో హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హై పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. శ్రీకాకుళం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీతారాం మాట్లాడారు. అధికారం చేపట్టి ఆరు నెలలైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు.

 రైతు రుణ మాఫీ అంటూ ప్రతి ఎన్నికల సభలో ప్రగల్భాలు పలికిన బాబు, రైతుసాధికారిత పేరుతో రూ.5 వేల కోట్లు ఇవ్వడం దారుణమన్నారు. రుణమాఫీకి లక్ష కోట్లు అవసరమన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డికే రూ.20 వేల కోట్లు చెల్లించాలన్నారు. కోటయ్య కమిటీ పేరుతో అమాయక రైతులతో ఆడుకోవడం తగదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎన్నికల ముందు బెల్టుషాపులు రద్దుచేస్తానని చెప్పి తీరా ఇప్పుడు వాటికి లెసైన్సులు ఇవ్వడాన్ని టీడీపీ సిగ్గుమాలిన చర్యగా తమ్మినేని అభివర్ణించారు.

 రేపటి ధర్నాను విజయవంతం చేయాలి
 ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయానికి నిరసనగా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళలు, కార్యకర్తలు, ప్రజలు ధర్నాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాతపట్నం ఎమ్మెల్యే కె.వెంకటరమణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సుజల పథకం పేరుతో జిల్లాలో 5 వేల గ్రామాల్లో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న టీడీపీ కనీసం నియోజకవర్గానికి ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నర్తు రామారావు, మున్సిపల్  మాజీ చైర్మన్లు అంధవరపు నరసింహం, ఎంవీ పద్మావతి, చల్లా రవి, గొండు కృష్ణమూర్తి, మామిడి శ్రీ కాంత్, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్.ప్రసాద్, ఎ.శ్రీను, రొక్కం సూర్యప్రకాశరావు, కొరాడ రమేష్, ఎ.సూరిబాబు, మల్లేశ్వరరావు, ధనుంజయ పాల్గొన్నారు.

 మహాధర్నాకు తరలిరండి
 ఎల్.ఎన్.పేట :  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బుధవారం అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించే వైఎస్సార్ సీపీ మహాధర్నాకు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీని నిలబెట్టుకోని సీఎం చంద్రబాబుకు ప్రజా బలం చూపించాలన్నారు. కొల్ల గోవిందరావు, పి.విష్ణు, కె.చిరంజీవి, ఎస్.కిశోర్, సాంబశివరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయాన్ని గ్రామీణ వికాస్‌బ్యాంకు సమీపంలోకి మార్చినట్టు పార్టీ కన్వీనర్ కొల్ల గోవిందరావు చెప్పారు.
Share this article :

0 comments: