హుదుద్ తుఫాన్ బాధితులకు కువైట్ వైయస్సార్ సిపి చేయుత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హుదుద్ తుఫాన్ బాధితులకు కువైట్ వైయస్సార్ సిపి చేయుత

హుదుద్ తుఫాన్ బాధితులకు కువైట్ వైయస్సార్ సిపి చేయుత

Written By news on Saturday, November 8, 2014 | 11/08/2014

 
కువైట్: జన నేత జగన్ గారి పిలుపు మేరకు దాసారి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు తుపాకుల బాబు ,అధ్యక్షుడు గోవింద్ సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి గోవింద్ నాగరాజు. ఉపాధ్యక్షుడు కొప్పోలు మల్లికార్జున. మరియు సీనియరు సభ్యుడు కొప్పోలు వెంకటసుబ్బయ్యసభ్యుడు 20వేల. రూపాయల ఆర్ధిక సహాయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హుదుద్ బాధితుల సహాయ నిధికి పంపాలని కువైట్ వైయస్సార్ సి.పి. కో ఆర్డినేటర్ ఇలియాస్ బి.హెచ్, జాయింట్ కోఅర్డినేటర్ యం. బాలిరెడ్డి గార్లకు అందచేశారు. ఈ సందర్భముగా గోవింద్ నాగరాజ్ మాట్లాడుతూ కువైట్ లో బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో హుదుద్ తుఫాన్ బాధితులకు విరాళాలు సేకరించాలని ఇలియాస్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి దాసరి సంక్షేమ సంఘం తమవంతు సహాయము చేసిందన్నారు. ఇలియాస్ గారు మాట్లాడుతూ కువైట్ వైయస్సార్ సి.పి. సభ్యులు మరియు దాతల నుండి విరాళాలు సేకరిస్తున్నారని తెలుపుతూ హుదుద్ తుఫాన్ బాధితులకు స్వచ్చందంగా చేయుత ఇచ్చిన దాసరి సంక్షేమ. సంఘ సభ్యులకు అభినిందిస్తూ పార్టీ తరపున కృతఘ్ణతలు తెలిపారు కార్యక్రమములో రాగురుచిన్నగంగిశెట్టి , గోవిందు రాజేష్ ,తుపాకుల కుళ్ళయాప్ప, తన్నీరు రమా దేవి,గోవింద్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: