పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
నల్లగొండ టుటౌన్: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ముఖ్య నాయకులందరూ కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాల ముఖ్య నేతలతో పార్టీ బలోపేతంపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీని గ్రామాల లో పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందు కు నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈనెల 13న నల్లగొండలో నిర్వహించాల్సిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని 19వ తేదీకి వాయిదా వేశామన్నారు. 19న జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆశయసాధన కోసం ప్రజల తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలయ్యేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునిల్‌కుమార్, మైనార్టీసెల్ జిల్లా కన్వీనర్ ఎండి. సలీం, ఎంపీటీసీ సభ్యుడు కట్టెబోయిన నాగరాజు, నేతలు మేడిశెట్టి యాదయ్య, రామానుజం, యూసుఫ్, భాస్కర్, ఫయాజ్, లక్ష్మీకాంత్, వంగాల వెంకటరెడ్డి, జహంగీర్, అతీఖ్‌అహమద్, చింత నవీన్, ఎండి. సిరాజ్, శ్రీను, గాదరి రమేష్ పాల్గొన్నారు.

0 comments:
Post a Comment