బాబులాగే కిరణ్ పాలన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబులాగే కిరణ్ పాలన

బాబులాగే కిరణ్ పాలన

Written By news on Thursday, August 22, 2013 | 8/22/2013

బాబులాగే కిరణ్ పాలన: గట్టు రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల చీకటి పరిపాలనను ఆదర్శంగా తీసుకొని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతి నిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందజేసే పెన్షన్‌ల విషయంలో అచ్చంగా బాబు బాటను అనుసరిస్తున్నారని విమర్శించా రు. పెన్షన్‌లు పొందే లబ్ధిదారులు మరణిస్తేనే కొత్తవారికి అవకాశం కల్పిస్తామని సీఎం చెప్పడం దారుణమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతీ ఒక్కరికీ శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేస్తే, ఆయన రెక్కల కష్టంపై వచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ... ఆ పథకాలను తుంగలో తొక్కడం దుర్మార్గమని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం గట్టు విలేకరులతో మాట్లాడుతూ... సీఎం కిరణ్ అవలంబిస్తున్న చర్యలపట్ల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతుందన్నారు.
 
  సీఎం, మంత్రులు సొంత ఎజెండాతో ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారే తప్ప ప్రజాసమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కావడంలేదని విమర్శించారు.  మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ మొదలుకొని ప్రతీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని వివరించారు. పేదవాని ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీలో 132 జబ్బులను తగ్గించారని, దాదాపు 80 ఆసుపత్రులను ఆ పథకం నుంచి తొల గించారని తెలిపారు. ప్రధానంగా గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను ఈ పథకం నుంచి దూరం చేశారని, అందుకే ఈ నెల 15 నుంచి చికిత్సలే జరగట్లేదని చెప్పారు. పెన్షన్‌ల విషయానికొస్తే అచ్చం చంద్రబాబు విధానాలనే అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు.
 
 ‘‘బాబు హయాంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందజేసే పెన్షన్ రూ.75 మాత్రమే ఉండేది. అది కూడా ప్రతీ 3 నెలలకొకసారి జన్మభూమి అంటూ అక్కడే ఇచ్చేవారు. లబ్ధిదారుల విషయానికొస్తే ఎవరైనా చనిపోతే తప్ప వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించేవారు కాదు’’ అని వివరించారు. మహానేత వైఎస్ హయాంలో పెన్షన్‌లను 18 లక్షల నుంచి 71లక్షలకు పెంచి, రూ.75 నుంచి 200లకు వృద్ధులకు, వికలాంగులకు రూ. 500 చేశారని గుర్తుచేశారు. బాబు బాటలో పయనిస్తున్న కిరణ్ పెన్షన్‌ల లబ్ధిదారులను ప్రతీ ఏటా కుదిస్తున్నారని తప్పుబట్టారు. వైఎస్ హయాంలో 71లక్షల మంది ఉండగా అనేక కొర్రీలు వేసి నాలుగు లక్షల మందిని తగ్గించారన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా... ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఆమె దారితప్పిన బిడ్డలాంటిది. అన్నగా వైఎస్సార్‌ను ఆరాధిస్తూ... అల్లుడిని అవమానించడం సరైందికాదు. ఆమె అంటే ఇప్పటికీ పార్టీలో చాలామందికి గౌరవం ఉంది. ఆ విమర్శలన్నీ ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం’’ అని గట్టు బదులిచ్చారు.
Share this article :

0 comments: