ఎత్తుగా.. లావుగా ఉన్నాడని మైకిస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎత్తుగా.. లావుగా ఉన్నాడని మైకిస్తారా?

ఎత్తుగా.. లావుగా ఉన్నాడని మైకిస్తారా?

Written By news on Thursday, March 12, 2015 | 3/12/2015


ఎత్తుగా.. లావుగా ఉన్నాడని మైకిస్తారా?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం రసవత్తర సన్నివేశం జరిగింది. ఎప్పుడూ నోరు వేసుకుని ప్రతిపక్షాన్ని విమర్శించే మంత్రి అచ్చెన్నాయుడి మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంధించిన విమర్శనాస్త్రాలు అందరికీ నవ్వు పుట్టించాయి. వైఎస్ జగన్ వ్యాఖ్యలతో సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. గృహనిర్మాణం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు తన శాఖతో సంబంధం లేకున్నా.. కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పడంతో.. వైఎస్ జగన్ మండిపడ్డారు. ''ఆయన సంబంధిత మంత్రి కాకున్నా.. ఎత్తుగా, లావుగా, భద్రంగా ఉన్నాడని ఊ అంటే ఆయనకు మైకిచ్చేస్తారు. (ఈ మాట అనగానే సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది) ఆయన అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తారు. మనిషి పెరుగుతున్నారు.. ఏం లాభం? ఎదిగే కొద్దీ ఒదగాలి, మానవత్వం ఉండాలి. అవేమీ లేవు. ఇలాంటి వ్యక్తులు ఇంత దారుణమైన మాటలు మాట్లాడేముందు మానవత్వం గురించి తెలుసుకోవాలి. చేయాల్సిన పనుల గురించి తెలుసుకోవాలి'' అని వైఎస్ జగన్ అన్నారు.  

అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ''మీరు  ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, కట్టిన ఇళ్లకూ బిల్లులు ఇవ్వడంలేదు. జియోట్యాగింగ్ పేరుతో ఇప్పటికే ఏడాది గడిచిపోయింది.. ఇప్పుడు మళ్లీ సభాసంఘం అంటూ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేసిన శిల్పామోహనరెడ్డిని పిలిచి పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. అప్పట్లో అవినీతి జరిగితే ఆయనకు టికెట్ ఎందుకిచ్చారు? మేం గత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడంలేదు. మేం దివంగత మహానేత వైఎస్ వారసులం అని గర్వంగా చెప్పుకొంటాం. గత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపింది మేం కాదు.. మీరే'' అని అధికారపక్షాన్ని దుమ్ము దులిపేశారు.
Share this article :

0 comments: