మాయ మాటలు.. భ్రమలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాయ మాటలు.. భ్రమలు

మాయ మాటలు.. భ్రమలు

Written By news on Thursday, March 12, 2015 | 3/12/2015


మాయ మాటలు.. భ్రమలు
  • అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టిన బుగ్గన
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నికలకు ముందు జనాన్ని హామీలతో సంతోషపెట్టారు. ఓట్లు వచ్చాక మీరు సంతోషపడ్డారు. మిమ్మల్ని సం తోషపెట్టాం, మేమూ సంతోషపడుతున్నాం. ఎన్నికల సమయంలో మిమ్మల్ని సంతోషపెట్టాం, ఇప్పుడు మేం సంతోషిస్తున్నాం. రెంటికీ సరిపోయింది కదా..’’ అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం తీరుందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

బుధవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, 9 గంటల విద్యుత్, గుడిసెలు లేని ఇళ్లు, ఇంటింటికీ ఉద్యోగం అంటూ హామీల మోత మోగించిన మీరు ఒక్కటైనా అమలుకు ప్రయత్నిస్తున్నా రా? అంటూ మండిపడ్డారు. ‘రుణమాఫీ రూ.80 వేల కోట్లయితే కేవలం రూ.3 వేల కోట్లతో చేతులు దులుపుకున్నారు. డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు, అపరాధ వడ్డీ రూ.2,500 కోట్లు కలిపి మొత్తం సుమారు రూ.17,000 కోట్లు ఉంది. 60 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తుండేవారు. ఇప్పుడేమో 65 ఏళ్లు దాటితేగానీ ఇవ్వడం లేదు. ఇదేనా మీ ప్రభుత్వ తీరు’ అంటూ దుయ్యబట్టారు.

మాఫీలంటూ జనాన్ని మాయచేసి అధికారంలోకి వచ్చాక ఒక్క పథకాన్నీ అమలు చేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను ఏమార్చుతుందో ఆయన సభలో వివరించారు. ‘పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ సమయంలోనూ, ఎమ్మెల్సీల పెంపు సమయంలో నూ రెండుసార్లు విభజన చట్టానికి సవరణ జరి గింది. ఈ సవరణ జరుగుతున్నప్పుడైనా కేం ద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడిందా?’ అని నిలదీశారు. దీనిపై మంత్రి ఉమా స్పందిస్తూ..  బాబు ప్రమాణ స్వీకారం చెయ్యకముందే పోలవరం ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పారు.
 
అప్పులు మీ హయాంలోనే

1991 నాటికి అప్పుల శాతం 21గా ఉంది. 2004 నాటికి 32 శాతానికి పెరిగింది. 2014 వచ్చేసరికి 22 శాతానికి తగ్గింది. అంటే 12 శాతం తగ్గినట్టు. దీన్ని మీరు గమనించారా అని బుగ్గన ప్రశ్నించారు. అంకెల గారడీ చూపింథ చేందుకు లక్ష కోట్ల బడ్జెట్ అంటున్నారని, 25 వేల కోట్ల లోటును అధిగమించేందుకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసమర్థులను క్షమిస్తారు, అమాయకులను భరిస్తారు, ఇంతలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు,  మంత్రి ప్రత్తిపాటి జోక్యం చేసుకుని, రాజేంద్రనాథ్‌రెడ్డి  అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.
 
స్థానిక సంస్థల నిర్వీర్యం: స్థానిక సంస్థల అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో బలమైన హక్కులున్నాయి. కానీ నేడు ఆ సంస్థల ప్రతినిధులు  ఏం చేయాలో ప్రశ్నించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో ప్రజాప్రతినిధులున్నారు, అధికారులున్నారు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు కానీ చంద్రబాబు ఒక్కరే పనిచేస్తున్నట్టు చెప్పడం ఏంటని, వీలైతే మీ సీఎంను ఒక్కసారి అడగాలని టీడీపీ సభ్యులకు సూచించారు. శివరామకృష్ణన్ హైపవర్ కమిటీపర్యటనలో ఉండగానే రాజధాని ఎక్కడో మీరే నిర్ణయించారు. భూములు తీసుకుంటున్నారు. ఏడాదికి మూడుపైర్లు వచ్చే భూములను ఎలా సేకరించారు?   సీఆర్‌డీఏ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకముందే ఒక్క ఎకరా కూడా స్వాధీనం చేసుకోకూడదు.  కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకే పట్టిసీమను చేపడుతున్నారని బుగ్గన మండిపడ్డారు.
Share this article :

0 comments: