Home »
» నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వరా?
నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వరా?
హైదరాబాద్: కరువు సమస్యపై మాట్లాడేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకపోడంతో గందరగోళం రేగింది. ఈ సమస్యపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సభాపతి కోడెల శివప్రసాదరావు అనుమతివ్వలేదు. ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని జగన్ కోరినా స్పీకర్ పట్టించుకోలేదు.దీంతో నిరసన తెలపడానికి కూడా సమయం ఇవ్వరా అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రజల ప్రభుత్వం స్పందించకపోతే ఎవరు స్పందిస్తారంటూ నిలదీశారు. తమ నాయకుడిని మాట్లాడే అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా స్పీకర్ మైక్ కట్ చేసి, సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
0 comments:
Post a Comment