చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా

చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు, సభ వాయిదా

Written By news on Friday, March 13, 2015 | 3/13/2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే పది నిమిషాలు పాటు వాయిదా పడింది.  ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో శుక్రవారం  సమావేశాలు మొదలయ్యాయి.  అసెంబ్లీ ప్రారంభం కాగానే  అంగన్ వాడీ వర్కర్ల సమస్యలపై చర్చించాలంటూ వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు.

దాంతో చర్చకు అనుమతించాలంటూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సమస్యను చర్చించేందుకు ముందుగా నోటీసు ఇవ్వాలని, ముందుగా సమావేశాలను సజావుగా కొనసాగేందుకు సహకరించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పట్టవీడకపోవటంతో స్పీకర్ పదినిమిషాల పాటు సభను వాయిదా వేశారు.
Share this article :

0 comments: