ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్

ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్

Written By news on Monday, March 9, 2015 | 3/09/2015


ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరుపై  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మైకులు కట్ అవుతాయని, ప్రతిపక్ష నాయకుడిపై అవాకులు చవాకులు పేలితే అందుకు ప్రతిగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం లేదన్నారు. ఇటువంటి వివక్ష ఎక్కడా లేదని, గవర్నర్ ప్రసంగం అనంతరం అధికార పక్ష సభ్యులు రెండు గంటలపాటు మాట్లాడిందే మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

నోరు తెరిస్తే అబద్ధాలు అని, చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ నేతలు కూడా అన్ని నేర్చుకున్నారన్నారు. సింగపూర్, జపాన్, అమెరికా మాదిరిగా రాజధాని కట్టండని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని...అయితే బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కోవటం సరికాదన్నారు. రైతుల భూములతో రియల్ వ్యాపారం చేస్తారా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో అధికార పక్షం అంటుందని....విభజన విషయంలో కేంద్రం అన్యాయం చేసినప్పుడు ప్రభుత్వంలో టీడీపీ...ఎందుకు కొనసాగుతుందని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. కేంద్ర వైఖరిని ఎండగడుతూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి పోరాడవచ్చు కదా అని ఆయన అన్నారు.
Share this article :

0 comments: