కేసీఆర్ పెంచినప్పుడు....బాబు ఎందుకు పెంచడు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసీఆర్ పెంచినప్పుడు....బాబు ఎందుకు పెంచడు?

కేసీఆర్ పెంచినప్పుడు....బాబు ఎందుకు పెంచడు?

Written By news on Friday, March 13, 2015 | 3/13/2015


కేసీఆర్ పెంచినప్పుడు....బాబు ఎందుకు పెంచడు?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్ వాడీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అవమాన పరిచే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ... అసెంబ్లీలో మహిళల సమస్యలపై మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించక పోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఈ ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమిస్తుందో దీనిని బట్టే అర్థమవుతుందని రోజా అన్నారు.  అంగన్ వాడీ ఉద్యోగులతో తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటుందని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలు పెరిగాయని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. కానీ గత తొమ్మిదేళ్ల సీఎంగా ఉండి... ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న చంద్రబాబు హయంలో మాత్రం అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలు కొంచెం కూడా పెంచలేదని విమర్శించారు. సదరు ఉద్యోగుల జీతాలు పెంచాలు పెంచాలి.... ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలి...ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పొందే అన్ని వసతులు అంగన్ వాడీ ఉద్యోగులకు కల్పించాలని ఈ సందర్బంగా రోజా... చంద్రబాబు సర్కార్ ను డిమాండ్ చేశారు. 
పొరుగున్న ఉన్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలు పెంచిన సంగతిని రోజా ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పెంచినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు పెంచదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఏపీ మంత్రి అటవీశాఖ మంత్రిగారి సొంత నియోజకవర్గంలో వేధింపులు తాళలేక ఓ అంగన్ వాడీ టీచర్ మరణించిన సంగతిని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు. 
Share this article :

0 comments: