వైఎస్‌ఆర్‌సీపీ నేతది హత్యే..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌సీపీ నేతది హత్యే..!

వైఎస్‌ఆర్‌సీపీ నేతది హత్యే..!

Written By news on Wednesday, March 11, 2015 | 3/11/2015


వైఎస్‌ఆర్‌సీపీ నేతది హత్యే..!
* విషమిచ్చి చనిపోయేలా చేశారు
* సుధీర్‌రెడ్డి పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
* దోషులను తేల్చాల్సింది పోలీసులే...

 
 సాక్షి ప్రతినిధి, వరంగల్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి మృతిపై నెలకొన్న అనుమానాలు వీడాయి. రోడ్డు ప్రమాదానికి ముందు సుధీర్‌రెడ్డి తీసుకున్న ఆహారంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. సుధీర్‌రెడ్డికి ఆస్తులు ఉండడంతో పాటు రాజకీయంగా శత్రువులు ఉండడంతో పక్కా ప్రణాళికతో కొందరు ఈ పని చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుధీర్‌రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తుల సహకారంతోనే ఆయన శత్రువులు ఈ పని చేసినట్లుగా తెలుస్తోంది. సుధీర్‌రెడ్డి మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించిన ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీస్ నివేదిక ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించలేదని స్పష్టం చేసింది. ఆర్గనోఫాస్ఫేట్ అనే పురుగుమందుల ఆనవాళ్లు సుధీర్‌రెడ్డి శరీంలో ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది.
 
 మృతదేహం నుంచి సేకరించిన నాలుగు నమూనాలను పరీక్షించగా... మూడింటిలోనూ ఆర్గనోఫాస్ఫేట్ ఆనవాళ్లు ఉన్నటు ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. ఫోరెన్సిక్‌కు సంబంధించిన నివేదికను సోమవారం వెల్లడించింది. ఈ నివేదిక ప్రతిని కాజీపేట డీఎస్పీకి, పోస్టుమార్టం చేసిన వైద్యుడికి పంపింది. విషం కారణంగా సుధీర్‌రెడ్డి శరీరం నిస్సత్తువకు గురైందని... అదే సమయంలో ప్రయాణంలో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. సుధీర్‌రెడ్డికి ఉన్న శత్రువులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరిపితేనే దోషులు ఎవరనేది తేలనుంది. మొదట రోడ్డు ప్రమాదం కారణంగానే సుధీర్‌రెడ్డి మృతి చెందినట్లుగా పోలీసులు భావించారు.
 
  తాజాగా ఫోరెన్సిక్ నివేదికతో ఇప్పుడు దోషులను గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భీంరెడ్డి సుధీర్‌రెడ్డి 2014 డిసెంబర్ 23న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మడికొండ పరిధిలోని తరాలపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సుధీర్‌రెడ్డి ఆ రోజు ఉదయం మల్లక్కపల్లిలో క్వారీ పనులను చూసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని హన్మకొండ వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయం కావడంతో సుధీర్‌రెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాదమే మృతికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రోడ్డు ప్రమాదమే అయినా సుధీర్‌రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
Share this article :

0 comments: