పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

Written By news on Thursday, March 12, 2015 | 3/12/2015

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం లోటస్ పాండ్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.  పార్టీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని అయిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు,అభిమానులు హాజరయ్యారు.

కాగా  ప్రజా సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటికి తన నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడమే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన ఈ పార్టీ తొలి నుంచీ ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది.
Share this article :

0 comments: