చేసింది చేసి మళ్లీ ఎంత చక్కటి డ్రామాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేసింది చేసి మళ్లీ ఎంత చక్కటి డ్రామాలు

చేసింది చేసి మళ్లీ ఎంత చక్కటి డ్రామాలు

Written By news on Tuesday, March 10, 2015 | 3/10/2015


అసలు జగన్ ఏం చేశాడు....వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా బీజేపీతో ఎందుకు పొత్తును కొనసాగిస్తోందని  విపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నించారు.  టీడీపీకి చేతగాక అనవసరం విపక్షంపై  ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.  ప్రతి విషయానికి పార్టీ అధ్యక్షుడే మీడియా ముందుకు రారని...పార్టీ ప్రతినిధి కూడా మాట్లాడతారన్నారు. ఈ సంప్రదాయం అన్ని పార్టీల్లోనూ ఉందని వైఎస్ జగన్ అన్నారు.

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు మీడియా పిచ్చి ఉంది కాబట్టే ప్రెస్ మీట్ పెట్టారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. దమ్ము, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. తాము ఢిల్లీ వెళితే ఆరోపణలు... చేయటం..వెళ్లకపోతే ఆరోపణలు అన్నిటికీ జగన్ నే కారణం అనటం మళ్లీ జగన్ పట్టించుకోవటం లేదంటూ ఆరోపణలు చేయటం ...ఇదంతా చూస్తుంటే అసలు జగన్ ఏం చేశాడంటూ ఆయన అన్నారు.

చేసింది చేసి మళ్లీ ఎంత చక్కటి డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా టీడీపీ మంత్రులపై మండిపడ్డారు. మంత్రులు చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెప్పటం చూస్తుంటే...చంద్రబాబు నాయుడుగారు మంత్రులకు ట్యూషన్లు బాగా చెబుతున్నారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు గోబెల్స్ ను మించిపోయారన్నారు.  

కేంద్ర మంత్రులను కూడా కలవటం తప్పుబట్టడం సరికాదని, తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకులను కలిసినప్పుడు ఏదో జరిగిందని ఊహించుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసినప్పుడు తాను ఏం మాట్లాడింది యనమల రామకృష్ణుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ విన్నారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Share this article :

0 comments: