చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా

చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా

Written By news on Tuesday, March 10, 2015 | 3/10/2015

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఏరు దాటక ముందు ఏటి మల్లన్న...ఏరుదాటాక ఓటి మల్లన్న' అన్నట్లు ఎన్నికల ముగిసిన తర్వాత డ్వాక్రా మహిళలను చంద్రబాబు రోడ్డున పడేశారని ఆమె అన్నారు.   డ్వాక్రా మహిళలను డబ్బులిచ్చి మరీ సమావేశాలకు తీసుకు వచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా వారిని విస్మరించారన్నారు.

అసెంబ్లీ నుంచి వాకౌట్ అనంతరం రోజా మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించడానికి టీడీపీకి దమ్ము, ధైర్యం లేదని అన్నారు.  డ్వాక్రా రుణాల మాఫీ అంశాన్ని చర్చించాలని తాము డిమాండ్ చేస్తే...ఇప్పుడు ఆ అంశం అంత ముఖ్యమా అని అసహనం వ్యక్తం చేస్తుంటే...ఆడపడుచులంటే వీరికి అంత చులకనా అనే భావం కలుగుతుందన్నారు.

చంద్రబాబు మహిళా ద్రోహి, రాష్ట్రంలో మహిళ వ్యతిరేక ప్రభుత్వం ఉందని రోజా అన్నారు.  డ్వాక్రా రుణాలు మాఫీ అని మేనిఫెస్టోలో పెట్టారని, అయితే రాష్ట్రంలో ఎటువంటి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. టీడీపీ నేతలకు మహిళల కన్నీళ్లు కనిపించడం లేదా అని రోజా సూటిగా ప్రశ్నించారు. డ్వాక్రా రుణమాఫీ జరిగేంతవరకు టీడీపీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. 
Share this article :

0 comments: