‘దీక్ష’బూని సాగుదాం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘దీక్ష’బూని సాగుదాం..

‘దీక్ష’బూని సాగుదాం..

Written By news on Tuesday, September 22, 2015 | 9/22/2015


‘దీక్ష’బూని సాగుదాం..
పట్నంబజారు(గుంటూరు) : వీధివీధినా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని  వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ  పార్టీ నాయకులకు సూచించారు. ఈ నెల 26న గుంటూరులో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే దీక్షలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని  పిలుపునిచ్చారు. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో సోమవారం పార్టీ గుంటూరు నగర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షత వహించారు. బొత్స మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

 జగన్ ఒత్తిడితోనే హోదాపై అసెంబ్లీతో తీర్మానం..
 మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంలో అసెంబ్లీ సాక్షిగా అధికారపార్టీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఒత్తిడితోనే అసెంబ్లీలో సైతం తీర్మానం చేశారని గుర్తుచేశారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. సిగ్గులేకుండా తాత్సారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నదుల అనుసంధానం పేరుతో అవినీతి అనుసంధానానికి నాంది పలికారని విమర్శించారు. టీడీపీ పాలనతో మహిళలకు రక్షణకరుైవైందని, ఎలుకలు, కుక్కల దాడుల్లో చిన్నారులు చచ్చిపోతున్నా.. ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. గుంటూరు మిర్చి ఘాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిలేలా దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది రైతన్న కోసం చంద్రన్న కాదని, చంద్ర చెరలో రైతులు ఉన్నారని విమర్శించా రు. కేవలం రూ.50వేల లోపు రుణమాఫీ అయిన రైతులను తీసుకొచ్చి సభల్లో మాట్లాడించడం సిగ్గు చేటన్నారు.
 పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడు తూ రైతులను విస్మరించి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మట్టిని దోపిడీ చేస్తూ అవినీతి పాలన అందిస్తుందని ధ్వజమెత్తారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారని దుయ్యబట్టారు.

వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు నారా వారి సారా పాలన అనే సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారని ఎద్దేవా చేశారు. రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలుగుజాతికి అన్యాయం జరుగుతున్న ప్రతిసారీ ఉద్యమ కెరటంలా జననేత పోరాటానికి సిద్ధపడుతున్నారని గుర్తుచేశారు. సభకు అధ్యక్షత వహించిన అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు దిమ్మతిరిగేలా దీక్షను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ దీక్షబూనాల న్నారు. 26న జరిగే దీక్ష రాష్ట్రప్రభుత్వ పతనానికి నాంది కాబోతోందని హెచ్చరించారు.తొలుత మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు లాలుపురం రాము, ఎండీ నసీర్‌అహ్మద్, పలు విభాగా   నేతలు కావటి మనోహర్‌నాయుడు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, దేవళ్ళ రేవతి, జ లగం రామకృష్ణ, మొగిలి మధు, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ గు లాంరసూల్, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, పల్లపు రాఘవ, దాసరి కిరణ్, కోటా పిచ్చిరెడ్డి, జానీ, గనిక ఝాన్సీరా ణి, నిమ్మరాజు శారదాలక్ష్మీ, కొట్టె కవిత, అంగడి శ్రీని వాసరావు, మండేపూడి పురుషోత్తం, పానుగంటి చైత న్య, దేవరాజు, శిఖా బెనర్జీ, మేరువ నర్సిరెడ్డి, మెహా మూద్, హాసన్‌బుజ్జి, అత్తోట జోసఫ్, సుంకర రామాం జనేయులు, మార్కెట్‌బాబు, మర్రి సత్యన్నారాయణ, ఆరుబండ్ల వెంకటకొండారెడ్డి, ఆవుల సుందర్‌రెడ్డి, యరమాల విజయ్‌కిషోర్, షేక్ రబ్బానీ పాల్గొన్నారు.

 జగన్ దీక్షకు భద్రత కల్పించండి..
 పట్నంబజారు(గుంటూరు) :  ఈ నెల 26 నుంచి  వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఆయనకు భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠ త్రిపాఠి,  నారాయణ నాయక్‌లను కలిసి విన్నవించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు, జిల్లాపరిశీలకుడు బొత్స సత్యనారాయణ ముందుగా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి ప్రతిపక్ష నేత జగన్ స్వయంగా దీక్షకు పూనుకుంటున్నందున భద్రత ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించాలని  కోరారు.

అనంతరం రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌ను కలిసి రూరల్ మండలాల నుంచి సైతం పార్టీ కార్యకర్తలు, నేతలు దీక్షకు తరలి వస్తారని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సిబ్బందికి సూచనలు చేయాలని కోరారు. విషయాలు విన్న ఎస్పీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.  ప్రత్యేకంగా ఒక అధికారిని నేతలకు కేటాయిస్తామని, వారి పర్యవేక్షణలో భద్రత ఏర్పాట్లతో పాటు, పార్కింగ్ తదితర అంశాలు చూసుకోవాలని సూచించారు. ఎస్పీలను కలిసిన వారిలో పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.

 నియోజకవర్గ పరిశీలకులతో సమీక్ష
 ప్రత్యేక హోదాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్టీ నియమించిన నియోజకవర్గాల పరిశీలకులు బాధ్యతతో పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం  పార్టీ నియోజకవర్గాల పరిశీలకులతో ఆయన సమీక్ష నిర్వహించారు బొత్స మాట్లాడుతూ 24వ తేదీకల్లా అన్ని మండలాల్లో సమావేశాలు ముగించాలని సూచించారు.  సమావేశంలో  పార్టీ ముఖ్యనేతలో పాటు నియోజకవర్గాల సమావేశాల పరిశీలకులు జలగం రామకృష్ణ, గురవాచారి, పిల్లి ఓబులరెడ్డి, మర్రి వెంకటరామిరెడ్డి, దేవళ్ళ రేవతి,  సునీల్‌కుమార్, బసవ పూర్ణచంద్రరావు, సయ్యద్ మాబు, సాయిబాబు, కొత్తా చినపరెడ్డి, డేవిడ్‌రాజు, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, రూత్‌రాణి, కోటేశ్వరరావు, డేవిడ్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: