చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే...

చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే...

Written By news on Tuesday, September 22, 2015 | 9/22/2015

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆడపిల్లలు లేరు కాబట్టే, వారి విలువేంటో ఆయనకు తెలియడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. భానుప్రీతి మృతిపై ఆమె మాట్లాడుతూ.. నాగార్జున యూనివర్సిటీలో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధిని రిషితేశ్వరి కేసును టీడీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఉంటే భానుప్రీతి ఆత్మహత్య చేసుకునేదా అని ప్రశ్నించారు.

విద్యార్థులు, మహిళల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జిల్లాలో సైకో సూదిగాడు తయారయ్యాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్ సహా ముగ్గురు మహిళా మంత్రులు కూడా ఈ ఆత్మహత్యలపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఆడపిల్లలు చనిపోతున్నా.. మహిళా అధికారిణిలపై దాడులు జరుగుతున్నా ఇవేం పట్టించుకోకుండా చంద్రబాబు మాత్రం సింగపూర్, మలేషియా అంటూ విదేశాలలో విలాసాలు చేస్తున్నారంటూ రోజా విమర్శించారు.
Share this article :

0 comments: