కుట్ర సాగదు...దీక్ష ఆగదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్ర సాగదు...దీక్ష ఆగదు

కుట్ర సాగదు...దీక్ష ఆగదు

Written By news on Thursday, September 24, 2015 | 9/24/2015


కుట్ర సాగదు...దీక్ష ఆగదు
గుంటూరు : ప్రత్యేక హోదా ప్రజల హక్కు అనే నినాదంతో వైఎస్సార్ సీపీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష నిర్ణీత ఉల్ఫ్‌హాలు స్థలంలోనే జరిగి తీరుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకున్నందునే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదన్నారు. అంతేకాకుండా జగన్ దీక్షపై పోలీసుల ఆంక్షలు చూస్తుంటే ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం నుంచి మరో గొంతు వినిపించకుండా చూస్తామని కూడా హామీ ఇచ్చినట్టుందని అన్నారు.

 గుంటూరులోని ఉల్ఫ్‌హాలు స్థలంలో జగన్ దీక్షకు వేదిక నిర్మాణం, సీలింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకొంటున్న తరుణంలో బుధవారం పోలీసులు అడ్డుకుని పనులు నిలుపుదల చే యించటంపై పార్టీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షాస్థలానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలను విమర్శిస్తూ, దీనివెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు..

► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడు తూ, ప్రభుత్వ స్థలాలపై అభ్యంతరం చెప్పిన పోలీసులు ఇప్పుడు ప్రైవేటు స్థలంలో దీక్షకు అభ్యంతరం చెప్పటం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. శాంతియుత పోరాటం చేసే హక్కు రాజ్యాంగమే కల్పించిందనీ, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు.
► ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జగన్ మోహన్‌రెడ్డి దీక్షను అడ్డుకోవాలని చూడటం అప్రజాస్వామికమని అన్నా రు. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దీక్షను అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ప్రజలపక్షాన నిలబడి ప్రత్యేక హోదా కోసం పాటుపడుతున్న దీక్షను ఆపటం ఎవరి తరమూ కాదన్నారు.
► పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నపుడు ఎక్కడబడితే అక్కడ దీక్షలు చేసిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు నియంతలా అభ్యంతరం చెప్పటం దుర్మార్గమన్నారు.
► మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ,  15 రోజుల క్రితమే రిప్రజెంటేషన్ ఇచ్చి, దీక్షకు ఏర్పాట్లు చేస్తుంటే తీరా రెండురోజుల ముందు వచ్చి అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ముందు రోజు రాత్రి చంద్రబాబు సింగపూర్ నుంచి వ చ్చారనీ, తిరుపతి, విశాఖలో జగన్ యువభేరికి నీరాజనం పలకటంతో తన మోసాలు సాగవన్న దుర్బుద్ధితో ఆగమేఘాలపై ఆదేశాలు జారీచేసి దీక్షను అడ్డుకోవాలని చూస్తున్నట్టు ఆరోపించారు.
► పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఆపేది లేదనీ, కుట్రలు కొనసాగించాలనుకుంటే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.
► పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలకు లోబడి ప్రజల కోసం జగన్ చేపడుతున్న శాంతియుత దీక్షను శాంతిభద్రతల సమస్య సాకుగా చూపి, అడ్డుకోవాలని చూస్తే ఆగటానికి  ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. 26న అవసరమైతే నగరాన్ని దిగ్భందనం చేసి అయినా సరే, దీక్ష జరిగి తీరుతుందన్నారు.
► ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పిరికిపంద చర్యగా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.
► పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్టినేటర్ తలశిల రఘురాం,   రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ నేతలు జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్‌నాయుడు,ఆతుకూరి ఆంజనేయులు, రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర ెహ నీ క్రిస్టినా, ఎండీ నసీర్‌అహ్మద్, లాల్‌పురం రాము, కర్నుమా, నూనె ఉమామహేశ్వరరెడ్డి,  పోలూరి వెంకటరెడ్డి, శానంపూడి రఘురామిరెడ్డి, సుద్దపల్లి నాగరాజు, జలగం రామకృష్ణ, ఆవుల సుందరరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, కొత్త చిన్నపరెడ్డి, మొగిలి మధు, బండారు సాయిబాబు, నిమ్మరాజు శారదలక్ష్మి, కొట్టె కవిత, శ్రీకాంత్ యాదవ్, కోట పిచ్చిరెడ్డి, సయ్యద్ మాబు, అంగడి శ్రీనివాసరావు, ఉప్పుటూరి నర్సిరెడ్డి, పానుగంటి చైతన్య, పెదాల బాబు, రాచకొండ ముత్యాలరాజు, గనిక ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

 ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు..
► మాజీ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ, పోలీసులను అడ్డంపెట్టుకుని జగన్ దీక్షను అడ్డుకోవాలనే చంద్రబాబు నిరంకుశ చర్య అప్రజాస్వామ్యమన్నారు. తాము చేస్తున్న దీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనీ, ప్రజల న్యాయమైన హక్కుల కోసం, రాష్ట్రా న్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటానికి తలపెట్టినట్టు గుర్తుచేశారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకొని రాష్ట్రం నుంచి ప్రత్యేక హోదా డిమాండు రా కుండా చూస్తామని చెప్పినందునే ఇలా అడ్డుకుంటున్నారని భావిస్తున్నామని అన్నారు.
Share this article :

0 comments: