చంద్రబాబు నిజమైన ఊసరవెల్లి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు నిజమైన ఊసరవెల్లి

చంద్రబాబు నిజమైన ఊసరవెల్లి

Written By news on Thursday, September 24, 2015 | 9/24/2015


చంద్రబాబు నిజమైన ఊసరవెల్లి
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

 చిలకలూరిపేటటౌన్ : సీఎం చంద్రబాబునాయుడు నిజమైన ఊసరవెల్లి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ఈ నెల 26 న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతుగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, ముఖ్యకార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం చంద్రన్న యాత్ర అని చెప్పుకుంటూ రైతుల గురించి కాకుండా ప్రతిపక్ష నాయకుడు, పార్టీపై అనుచిత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం ప్రారంభించి మామపై పోటీ చేస్తానని నాడు బీరాలు పలికిన చంద్రబాబునాయుడు టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి మారి రంగులు మార్చే ఊసరవెల్లిగా నిరూపించుకొన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మతతత్వ బీజేపీ తో పొత్తు పెట్టుకోవటం పొరపాటని విమర్శించి అనేక సందర్బాల్లో చంద్రబాబునాయుడు ఊసరవెల్లి నైజం బయట పెట్టుకొన్న విషయం టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలని తెలిపారు.

 జిల్లా మంత్రులవి ప్రేలాపనలు ..
 ముఖ్యమంత్రి మెప్పు కోసం జిల్లా మంత్రులు  దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని  విమర్శించారు. కేసుల్లో నుంచి బయట పడేందుకే జగన్ ఉద్యమాలు చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాఖ్యానించటం హేయమన్నారు. ఓటు కు నోటు కేసులో నుంచి బయట పడేందుకు ప్రధాన మంత్రి మోదీ కాళ్ల వద్ద సాగిలపడ్డారో, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ దేవెళ్ల రేవతి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడక  దీక్షకు దిగుతున్న వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై విమర్శలు టీడీపీ నాయకులు మానుకోవాలని చెప్పారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమౌతుందని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు దీక్షల్లో భాగస్వాములు కావాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుభానీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్లోర్‌లీడర్ నాయుడు శ్రీనివాసు, డిప్యూటి ప్లోర్‌లీడర్ షేక్ అబ్దుల్ రౌఫ్, కౌన్సిలర్లు దారా అరుణకుమారి, నరసింహుల అన్నపూర్ణ, నాగూల్‌మీరా,షేక్ కాలేషావలి, పలువురు నాయకులు  పాల్గొన్నారు.
Share this article :

0 comments: