ఆయనకు సింగపూర్ తో సంబంధమేమిటి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయనకు సింగపూర్ తో సంబంధమేమిటి?

ఆయనకు సింగపూర్ తో సంబంధమేమిటి?

Written By news on Saturday, September 26, 2015 | 9/26/2015


ఆయనకు సింగపూర్ తో సంబంధమేమిటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నేత అనంత వెంకటామిరెడ్డి మండిపడ్డారు. ఏపీ రాజధానిని సింగపూర్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్న చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలైందని విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో అనంత వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ  ఆయనో గోముఖ వ్యాఘ్రమని ఘాటుగా విమర్శించారు. 
రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు పెట్టలేదని అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం ప్రారంభిస్తే సింగపూర్ కంపెనీలు రావని భయమా?అని నిలదీశారు. చంద్రబాబుకు సింగపూర్ కు మధ్య ఉన్న సంబంధమేంటో బయటపెట్టాలని వెంకటామిరెడ్డి డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: