ధర్మయుద్ధానికి మద్దతివ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధర్మయుద్ధానికి మద్దతివ్వండి

ధర్మయుద్ధానికి మద్దతివ్వండి

Written By news on Saturday, September 26, 2015 | 9/26/2015


ధర్మయుద్ధానికి మద్దతివ్వండి
న్యాయవాదుల సమావేశంలో  వైఎస్సార్ సీపీ నేతల పిలుపు

 పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అధర్మ యుద్ధాన్ని అడ్డుకోవటం కోసం జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ధర్మ పోరాటానికి న్యాయవాదులంతా మద్దతుగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. హిట్లర్ పాలనను గురించి వినటమే తప్ప  చూడలేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు ప్రతిరూపమని నిప్పులు చెరిగారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ లీగల్ విభాగం సమావేశం జరిగింది. సమావేశానికి లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైఎస్ జగన్ చేపడుతున్న నిరవధిక దీక్షను అడ్డుకోవటం కోసం చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ దీక్ష  రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా జరుగుతుందనే పోలీసులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జగన్ దీక్షకు అండగా నిలిచి అవసరమైతే న్యాయపోరాటానికి న్యాయవాదులంతా సిద్ధంగా ఉండాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ బాబా రాందేవ్, అన్నాహజారేలతో పాటు ఎంతోమంది దీక్షలు చేశారని, ప్రాణానికి ప్రమాదం లేనంత వరకు దీక్షలు చేసుకునే అవకాశం ఉందని  సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ విధానాలను అడ్డుకునేందుకు న్యాయపోరాటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని చెప్పారు.

సమావేశంలో పలు విభాగాల నేతలు ఎలికా శ్రీకాంత్‌యాదవ్, శిఖా బెనర్జీ, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, అంగడి శ్రీనివాసరావు, దేవరాజ్, పానుగంటి చైతన్య, మేరువ నర్సిరెడ్డి, న్యాయవాదులు వరదాయిని, కారసాని కోటిరెడ్డి, జి.విజయ్, బోడపాటి కిషోర్, బి.కిరణ్, రత్నశేఖర్, వి.కేశవరావు, సుబ్బారావు, జె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: