అసమర్థ, అవినీతి, దోపిడీ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసమర్థ, అవినీతి, దోపిడీ...

అసమర్థ, అవినీతి, దోపిడీ...

Written By news on Sunday, September 20, 2015 | 9/20/2015


ఇదో దోపిడీ ప్రభుత్వం: బొత్స
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుది ఓ అసమర్థ, అవినీతి, దోపిడీ ప్రభుత్వమని, ఈ విషయాన్ని ఆయనే జిల్లా కలెక్టర్ల సమావేశంలో అంగీకరించారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి, పశ్చిమగోదావరి జిల్లా నేత కారుమూరు నాగేశ్వరరావుతో కలిసి ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖల్లో అవినీతి పెచ్చరిల్లి పోయిందని చంద్రబాబే స్వయంగా అంగీకరించారని చెప్పారు.

ఈ రెండు మూడు శాఖల్లోనే అవినీతి ఉందని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తే వ్యవసాయ, పౌరసరఫరాలు, ఆరోగ్య తదితర శాఖల్లో లేదనుకోవాలా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో రూ.రెండు వేలకోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారనీ, వాస్తవానికి అంతకు పదింతలు రూ.20 వేలకోట్ల మేరకు అవినీతి జరిగిందని చెప్పారు. ఈ అవినీతిలో ముఖ్యమంత్రిదే ప్రధానవాటా అయినప్పటికీ... మంత్రులను, అధికారులను బలిపశువులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక, మట్టి, నీరు వంటి పంచభూతాలన్నింటినీ దోచుకోవడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఆసుపత్రిలోనే శిశువులను ఎలుకలు కొరికి ప్రాణాలు తీస్తోంటే ఆ శాఖ బాగుందా? ఆరోగ్య శాఖ మంత్రిలాంటి అసమర్థ మంత్రి మరొకరు లేరని వ్యాఖ్యానించారు.

 పుష్కరాల మృతులపై దర్యాప్తు మభ్య పెట్టడానికే
 గోదావరి పుష్కరాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోయిన రెండు నెలలకు తాపీగా విచారణకు ఆదేశించడం, విచారణ కమిటీకి ఆరు నెలల గడువు ఇవ్వడం కేవలం ప్రజలను మభ్య పెట్టడానికేనని బొత్స దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను వైఎస్సార్‌సీపీ మరోసారి విజ్ఞప్తి చేస్తోందని, 25వ తేదీకి లోపుగా ప్రత్యేక హోదా ప్రకటించకపోతే 26 నుంచి తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్షకు పూనుకుంటారని ఆయన హెచ్చరించారు.
Share this article :

0 comments: