అహంకారంతో, ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అహంకారంతో, ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు

అహంకారంతో, ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు

Written By news on Friday, September 25, 2015 | 9/25/2015

చంద్రబాబు అహంకారంతోను, గర్వంతోను, ఫ్రస్టేషన్లోను మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, పోలీసులతో అణిచేయాలని చూస్తున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అహంభావం నెత్తికెక్కి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని, ప్రత్యేక హోదా సాధించడం మీ వల్ల కాకపోతే సమస్యను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తానని వైఎస్ జగన్ ముందుకొచ్చారని అంబటి అన్నారు.

ఆ దీక్షకు అనుమతి ఇవ్వబోమని ఓవైపు ముఖ్యమంత్రి చెబుతున్నారని.. కానీ పోలీసు శాఖ మాత్రం వేరే గ్రౌండులో పెట్టుకుంటే అనుమతి ఇస్తామని చెబుతోందని, ఈ ద్వంద్వవైఖరి ఏంటని నిలదీశారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు మతి భ్రమించిందేమో అనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైనంత మాత్రాన మీరు చెప్పిందే చట్టమా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా రైతుల సమస్యల మీద నిరాహార దీక్ష చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేశారు. అన్నా హజారే కూడా వివిధ కారణాల కోసం నిరాహార దీక్షలు చేస్తున్నారని, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండి కూడా దీక్షలు చేశారని, అప్పుడేమీ అభ్యంతరం లేదు గానీ జగన్ దీక్ష చేస్తానంటే అభ్యంతరం వచ్చిందా అని అంబటి రాంబాబు విమర్శించారు.

ఇష్టం వచ్చినట్లు అణిచేయాలని చూస్తే మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. మీరు ఈ రాష్ట్రానికి శాశ్వత సీఎం కాదని.. ధర్మంగా, న్యాయంగా ఆలోచించాలని అన్నారు. చట్టబద్ధంగా నిరాహార చేస్తుంటే ఇన్ని ఇబ్బందులు పెడతారా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్తుంటే ఆంక్షలు, ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్తుంటే ఆంక్షలు పెడతారా అని మండిపడ్డారు. అదే ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్ చేశారు, లోకేష్ బర్త్ డే వేడుకలు చేశారని.. అవి రాజకీయాలు కావు గానీ.. ప్రత్యేక హోదాపై సదస్సు పెడితే రాజకీయమా అని ఆయన ప్రశ్నించారు.
Share this article :

0 comments: