భూదాహం తీరలేదా..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూదాహం తీరలేదా..!

భూదాహం తీరలేదా..!

Written By news on Wednesday, September 23, 2015 | 9/23/2015


భూదాహం తీరలేదా..!
మచిలీపట్నం టౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు ఇంకా భూదాహం తీరలేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్కొన్నారు. మండలంలోని చిన్నాపురంలో 963.9 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రీయల్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ప్రతిపాదించారని తెలిపారు. రాష్ట్ర ఇండస్ట్రీయల్ అండ్ కామర్స్(ఇంఫ్రా) శాఖ 21వ తేదీ జీవో జారీ చేసిందన్నారు. దీనిలో 254.39 ఎకరాలు రైతుల ప్రైవేటు భూమి, 709.51 ఎకరాల పేద రైతులు అనుభవిస్తున్న ఎస్సైన్డ్ భూమిని తీసుకునేందుకు జీవోలో చూపారని తెలిపారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవటానకే తమ పార్టీ వ్యతిరేకమన్నారు. రైతులు కోరిన పరిహారాన్ని ఇచ్చి భూములు సేకరిస్తే తామూ కలిసి వస్తామన్నారు. సమావేశాలు పట్టణంలో కాకుండా భూ సేకరణ చేస్తున్న గ్రామాల్లో రైతుల వద్ద పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 భూములు లాక్కునేందుకు తంటాలు..
 గ్రామాల్లో భూములను లాక్కునేందుకు నానాతంటాలు పడుతున్న టీడీపీ నాయకులు సోమవారం మరో వీధి నాటకానికి తెరలేపారని పేర్ని నాని ఆరోపించారు. ఆ పార్టీ కార్యకర్తల వాహనాలకు తెల్ల జెండాలు కట్టి పోర్టు, పరిశ్రమలు కావాలంటూ ర్యాలీ నిర్వహించారన్నారు. ర్యాలీ సభలో పాల్గొన్న ప్రవేటు స్కూల్స్ అసోసియేషన్ నాయకులు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే పరిశ్రమలు కావాలంటున్నారని తెలిపారు. రైతులు భూములు కోల్పోతే మీ పాఠశాలలో చదివే వారి పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి వస్తుందని వారు గమనించాలని కోరారు.

 రుజువు చేసి జైలుకు పంపండి..
 తాను అక్రమ ఆస్తులు సంపాదించానంటూ తమ్ముడు ఎంపీ బుల్లయ్య తన అనుచరులతో అరోపణలు చేయిస్తున్నాడని ఆరోపించారు. దమ్ము, నిజాయితీ ఉంటే తన ఆస్తులపై దాడులు చేయించి, నిజం తేలితే జైల్లో పెట్టించాలని పేర్ని నాని సవాల్ విసిరారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు తాడిబోయిన విజయలక్ష్మి, దళిత విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుమూడి విక్టర్‌ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి మాది వాడ రాము, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, కౌన్సిలర్లు మట్టా తులసి, శీలం బాబ్జి, లంక సూరిబాబు, మేకల సుబ్బన్న, కాగిత జవహర్‌లాల్  పాల్గొన్నారు.
Share this article :

0 comments: