ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షంపై సస్పెన్షన్ వేటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షంపై సస్పెన్షన్ వేటు

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షంపై సస్పెన్షన్ వేటు

Written By news on Friday, December 18, 2015 | 12/18/2015


ప్రతిపక్షం మొత్తాన్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి తమ చర్చ తాము జరుపుకోడానికి అధికార పక్షం కుట్ర పన్నింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరినీ అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసేవరకు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. కాల్ మనీ అంశంపై చర్చకు విపక్షం పట్టుబట్టడం, అయినా వినిపించుకోకుండా అధికార పక్షం యథా ప్రకారం అంబేద్కర్ అంశంపైనే చర్చను కొనసాగిస్తుండటంతో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.

దాంతో యనమల మొత్తం ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలంటూ స్పీకర్‌ను కోరారు. దాన్ని సభ ఆమోదించిందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటిస్తూ, అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసేవరకు మొత్తం ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు అందరి పేర్లను చదివి ప్రకటించారు.
అయినా కొద్దిసేపటి పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలోనే ఉండి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సస్పెండైన సభ్యులందరూ వెంటనే సభను వదిలిపెట్టి వెళ్లిపోవాలని స్పీకర్ పదేపదే చెప్పారు. సభలో అనుచిత ప్రవర్తన మానుకోవాలని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో స్పీకర్ కోడెల తన సీటు నుంచి లేచి వెళ్లిపోగా, ప్యానల్ స్పీకర్ విష్ణుకుమార్ రాజు అధ్యక్ష స్థానంలోకి వచ్చారు. ఆయన మార్షల్స్‌ను పిలిచి, విపక్ష సభ్యులను బయటకు పంపాల్సిందిగా సూచించారు.
Share this article :

0 comments: