ఉషోదయాలోకి రిలయన్స్ నిధుల వరదపై దర్యాప్తు మొదలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఉషోదయాలోకి రిలయన్స్ నిధుల వరదపై దర్యాప్తు మొదలు

ఉషోదయాలోకి రిలయన్స్ నిధుల వరదపై దర్యాప్తు మొదలు

Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012


2007-08 సంవత్సరం ఆర్డర్‌ను సమీక్షిస్తామంటూ నోటీసులు
పాత సినిమాలు, సీరియళ్లకు రూ.787 కోట్ల విలువపై విచారణ
మార్గదర్శి డిపాజిట్లపై సుప్రీంకో మాట... ఆర్‌బీఐకి మరోమాట
ఈ మేరకు రూ.150 కోట్ల తేడా; దానిపైనా ఐటీ సమీక్ష
ఆడిటర్ విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు స్పందనగా ఈ చర్యలు
సోమవారం ఐటీ ముందు హాజరై మరిన్ని వివరాలిచ్చిన సాయిరెడ్డి
అక్రమ డీల్స్, మనీ లాండరింగ్‌పై 193 పేజీల పత్రాల సమర్పణ
కేజీ బేసిన్ గ్యాస్‌ను కట్టబెట్టినందుకే బాబుకు రిలయన్స్ క్విడ్ ప్రో కో
దాన్నే రామోజీకి గురుదక్షిణగా బాబు చెల్లించారని వెల్లడి

రాజగురువు అసలు రంగు బయట పడుతోంది. నిత్యం ఉషోదయంతో పాటే తన ‘ఈనాడు’ పత్రిక ద్వారా శ్రీరంగ నీతులు వల్లిస్తూ.. తెర వెనక మాత్రం అదే ఉషోదయాలోకి అల్లిబిల్లి కంపెనీల నీడన.. అడ్డంగా, అడ్డదిడ్డంగా, భారీగా, అక్రమంగా నిధులు రాబట్టుకున్న అతి పెద్ద ఆర్థిక నేరం తాలూకు గుట్టు పూర్తిస్థాయిలో రట్టవుతోంది. తన గ్రూపు కంపెనీలతో కలిసి రామోజీ ఏకంగా వేలాది కోట్ల రూపాయల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడ్డ వైనంపైనా నెమ్మదిగా తెర తొలగుతోంది. ఇటు మీడియా పవర్‌ను, అటు అప్పటి ప్రభుత్వంపై తనకున్న పూర్తిస్థాయి ‘పట్టు’నే తిరుగులేని పెట్టుబడిగా మార్చుకుని, అస్మదీయ ‘బాబు’కు అంబానీ చదివించుకున్న‘కేజీ బేసిన్ గ్యాస్’ ప్రతిఫలాన్నే గొట్టం కంపెనీల ద్వారా ఇష్టారాజ్యంగా సొంత సంస్థల్లోకి ఆయన మళ్లించుకున్న తీరు బట్టబయలవుతోంది. ఈ బాగోతంపై ససాక్ష్యంగా ఆడిటర్ విజయసాయిరెడ్డి కొంతకాలం క్రితం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గురివింద నీతుల రామోజీ ఆర్థిక నేరాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తోంది...

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)

‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝళిపించింది. ఊహలకందని రీతిలో గొట్టం కంపెనీలు సృష్టించి... పనికిరాని సీరియళ్లను సైతం బంగారు గనులుగా చూపించి... అడ్డగోలుగా, అక్రమంగా వేలకోట్ల రూపాయల్ని తెచ్చుకున్న తీరుపై ఆ శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. 35 రోజుల వ్యవధిలో పుట్టిన పదుల కొద్దీ గొట్టం కంపెనీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లోకి నిధులు ప్రవహించిన తీరును తప్పుబడుతూ... దీనికి సంబంధించి జారీ చేసిన 2007-08 సంవత్సరపు ఉత్తర్వుల్ని ఆ శాఖ పక్కనబెట్టింది. ఈ నిధుల ప్రవాహపు తీరును సమీక్షిస్తున్నామంటూ రామోజీరావుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, ఆయన గ్రూపు కంపెనీలు కలిసి రూ.3,550 కోట్ల మేర ఆదాయపు పన్నును ఎగవేశాయని, కేజీ బేసిన్ గ్యాస్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టిన చంద్రబాబు.. అందుకోసం ఆ సంస్థ నుంచి తాను తాను తీసుకున్న ముడుపులనే గురుదక్షిణ రూపంలో రామోజీరావుకు అదే రిలయన్స్ ద్వారా తిరిగి అందజేశారంటూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఐటీ శాఖ ఈ చర్యలు తీసుకుంది. అంతేకాదు.. పాత సినిమాలు, అప్పటికే ప్రసారమై, కాలం చెల్లిపోయిన సీరియళ్లను ఉషాకిరణ్ టెలివిజన్, ఉషాకిరణ్ మూవీస్ ఒకదానికొకటి విక్రయించుకునట్టుగా చూపించి, దానికి ఆకాశాన్నంటే రీతిలో ఏకంగా రూ.787 కోట్లు కట్టిన తీరుపై కూడా ఐటీ శాఖ దర్యాప్తు మొదలుపెట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లకు సంబంధించి రామోజీరావు అటు సుప్రీంకోర్టు వద్ద, ఇటు రిజర్వు బ్యాంకు వద్ద పేర్కొన్న మొత్తాల్లో దాదాపు రూ.150 కోట్ల మేరకు తేడా ఉంది. ఈ అంశాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ తాజాగా స్పష్టం చేసింది. నిజానికి ఈ అక్రమాలపై విజయసాయిరెడ్డి 2012 ఫిబ్రవరిలోనే పిటిషన్ వేశారు. అనంతరం దానిపై తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేశారు. వీటన్నిటినీ జతచేస్తూ.. సోమవారం ఆయన నేరుగా ఐటీ కార్యాలయానికి వెళ్లి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరిన్ని అంశాలను ఐటీ శాఖ దష్టికి ఆయన తీసుకెళ్లారు. 193 పేజీల డాక్యుమెంట్లను కూడా సమర్పించారు.

‘‘పనికిమాలిన ఆస్తుల్ని చూపించి ఉషోదయా సంస్థ తన విలును రూ.6,600 కోట్లుగా తనే అంచనా వేసుకుంది. దాంతో కుమ్మక్కయిన రిలయన్స్ గ్రూపు 2007 డిసెంబరు 3 నుంచి 2008 జనవరి 7 మధ్య... అంటే కేవలం 35 రోజుల్లో 6 బ్రీఫ్‌కేసు కంపెనీల్ని సష్టించి, వాటిద్వారా రూ.2,600 కోట్లను రామోజీ కంపెనీల్లోకి పంపించింది. ఇలా 39 శాతం వాటాను కొనుక్కుంది. చిత్రమేంటంటే వీటిలో అనూ ట్రేడింగ్ అనే గొట్టం కంపెనీ పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ.లక్ష. అలాగే మరో గొట్టం కంపెనీ ఈక్వేటర్ ట్రేడింగ్ పెయిడప్ క్యాపిటల్ రూ.200 కోట్లు. కానీ ఇవి ఒకో షేరుకు ఏకంగా రూ.5,28,630 చెల్లించి మొత్తమ్మీద రూ.2,606 కోట్లను ఉషోదయాలో పెట్టుబడి పెట్టాయి. ఇంత భారీ నిధులు తమకు ఏ సంస్థ నుంచి వచ్చాయన్నది తమ ఆస్తిఅప్పుల పట్టీల్లో ఈ కంపెనీలు ఎక్కడా చెప్పలేదు. కన్వర్టబుల్ లోన్‌గా ఆ డబ్బు తెచ్చుకున్నట్లు చూపించాయే తప్ప ఎవరి దగ్గర్నుంచి తెచ్చామన్నది చెప్పనేలేదు. నిజానికి ఈ డబ్బులు రిలయన్స్‌వే అయి ఉంటే అది తొలుత తన బోర్డు అనుమతి తీసుకోవాలి. సెబీకి చెప్పాలి. స్టాక్ ఎక్స్ఛేంజీలకూ సమాచారమివ్వాలి. అలా చేసినపుడు ఈ బ్రీఫ్‌కేసు కంపెనీల అవసరమే ఉండదు’’ అని విజయసాయిరెడ్డి వివరించారు. ఉషోదయా సంస్థ తన టీవీ చానెళ్ల విలువను రూ.4,200 కోట్లుగా చూపించిందని చెబుతూ... ‘‘వీటికి పాత సినిమాలు, సీరియళ్లపై హక్కులున్నా వాటిని అప్పటికే చాలాసార్లు ప్రసారం చేయటంతో విలువ లేకుండా పోయాయి. వాటికి విలువ కట్టిన ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ కూడా దీన్ని ప్రస్తావించింది’’ అన్నారు.

అడ్డగోలుగా విలువ పెంపు... ఆనక రిలయన్స్‌కు!

రామోజీరావు చేసిన మరో అక్రమాన్ని కూడా సాయిరెడ్డి ఆధారాలతో సహా వివరించారు. ‘‘2008లో రామోజీరావు మారిషస్‌కు చెందిన బ్లాక్‌స్టోన్ క్యాపిటల్ పార్ట్‌నర్స్‌కు తన సంస్థలో 13 శాతం వాటా రూ.590 కోట్లకు అమ్ముతానని ప్రతిపాదించారు. దీనికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) 2008 ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ఈ లెక్కన చూస్తే ఉషోదయా మొత్తం విలువ రూ.4,538 కోట్లు. కానీ రిలయన్స్-కంపానీలకు వచ్చేసరికి మాత్రం దీని విలువ ఏకంగా రూ.6,600 కోట్లకు పెరిగిపోయింది. బ్లాక్ మనీని మళ్లించడానికే ఇలా చేశారు తప్ప వేరొకదానికి కాదు’’ అంటూ ఇలాంటి వ్యవహారాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కూడా సాయిరెడ్డి ప్రస్తావించారు. ఎన్టీఆర్‌ను గద్దెదించటంలో చంద్రబాబు నాయుడికి రామోజీరావు సహకరించిన వైనాన్ని కూడా ఆయన సవివరంగా తెలియజేశారు. తర్వాత మద్య నిషేధాన్ని ఎత్తివేసే సమయంలో కూడా చంద్రబాబును రామోజీ తన ‘ఈనాడు’ ద్వారా పూర్తిస్థాయిలో ఎలా వెనకేసుకొచ్చిందీ వివరించారు.
కష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాల కోసం పోటీపడకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కావాల్సినంత మేలు చేశారని, అందుకు ప్రతిఫలంగానే రిలయన్స్ సంస్థ రూ.2,600 కోట్లు రామోజీ సంస్థల్లోకి పంపించిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రామోజీకి చంద్రబాబు సమర్పించుకున్న గురుదక్షిణగా దీన్ని అభివర్ణించారాయన. 

నాగార్జునా ఫైనాన్స్ వ్యవహారంలో డిపాజిటర్లను ముంచిన కంపానీకి చంద్రబాబు అన్నిరకాలుగా రక్షణనివ్వబట్టే ఆయన కూడా రంగంలోకి వచ్చారన్నారు. ‘‘రిలయన్స్ ఏమీ మామూలు సంస్థ కాదు. దేశంలోనే సమర్థమైన ఇన్వెస్టరు. అలాంటి సంస్థ దేన్లోనైనా పెట్టుబడి పెడితే తగిన నివేదికలు తెప్పించుకుని, నిజ నిర్ధారణ చేసుకుని, అన్నీ సరిచూసుకున్నాక, తనకు కావాల్సినంత ప్రచారం వచ్చే రీతిలో పెడుతుంది. కానీ ఏ నివేదికా కూడా లేకుండా బ్రీఫ్‌కేసు కంపెనీల ద్వారా అత్యంత రహస్యంగా పెట్టుబడి పెట్టడమే ఈ డీల్ తాలూకు అక్రమాల్ని సూచిస్తోంది’’ అని వివరించారు. ఇటీవల హైకోర్టులో వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశాకే.. రిలయన్స్ సంస్థ ఆ పెట్టుబడులు తమవని బహిరంగంగా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు.

‘‘బ్లాక్‌స్టోన్‌తో డీల్ ఆలస్యం కావటంతో కంపానీ-అంబానీ కలిసి చంద్రబాబు ప్రోద్భలంతో రామోజీని ఆదుకోవటానికి ఈ పెట్టుబడి పెట్టారు. దీనికోసం ఉషోదయా సంస్థ 2006-07లో రూ.192 కోట్లుగా ఉన్న తన నిర్వహణ లాభాన్ని 2007-08లో ఏకంగా రూ.314 కోట్లుగా చూపించింది. కానీ ఇది ఆ తరువాతి సంవత్సరాల్లో రూ.220, రూ.243 కోట్లకు తగ్గిపోయింది. ఆ ఏడాది లాభాల్ని కావాలని ఎక్కువ చూపించినట్టు దీన్ని బట్టే అర్థమవుతోంది’’ అని సాయిరెడ్డి వివరించారు.

ఇవిగో మనీ లాండరింగ్‌కు ఆధారాలు...

‘‘కంపానీ గ్రూపులో డెరైక్టర్లుగా ఉన్నవాళ్లే రిలయన్స్ సష్టించిన గొట్టం కంపెనీల్లోనూ డెరైక్టర్లుగా సాగారు. మనీ లాండరింగ్ జరిగిందనటానికి ఇంతకన్నా వేరే ఆధారాలు అక్కర్లేదు. అయితే తమ గ్రూపుపై సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, సీబీఐ వంటి సంస్థలు దర్యాప్తు జరపకుండా రిలయన్స్ సంస్థ మరో ఎత్తు వేసింది. ఉషోదయలో తమకున్న వాటాను నెట్‌వర్క్-18కు బదలాయించింది. ఇక్కడ కూడా ఈనాడు పత్రికలో తనకున్న వాటాను రామోజీ , చంద్రబాబు కోసం రిలయన్స్ త్యాగం చేసేసింది. గట్టిగా రూ.300 కోట్లు కూడా విలువ చెయ్యని తెలుగేతర చానెళ్లలో మాత్రమే వాటా ఉంచుకుంది. ఈ పనికిరాని చానెళ్లకు టీవీ-18 ఏకంగా రూ.2,100 కోట్ల విలువ కట్టగా, అందుకు కావలసిన డబ్బును కూడా మళ్లీ రిలయన్సే టీవీ-18కు అడ్వాన్సుగా అందజేసింది. ఇదంతా రిలయన్స్, టీవీ-18 ఇన్వెస్టర్లను బహిరంగంగా దోచుకోవటం, నిలువునా మోసం చేయటం తప్ప మరొకటి కాదు’’ అంటూ దీనిపై జాతీయ స్థాయి విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలను సైతం సాయిరెడ్డి ప్రస్తావించారు.

వాస్తవ విలువలా లేదు
‘‘టీవీ18-రిలయన్స్-ఈటీవీ డీల్‌లో చేతులు మారిన మొత్తం, ఈ డీల్‌లో ఇమిడి ఉన్న ఆస్తుల వాస్తవ విలువను ప్రతిబింబించడం లేదు. ఇందులో బయటికి చెప్ప(లే)ని ఇతర అంశాలేవో ఉండి ఉంటాయి. టీవీ-18 వాటాదారులు వచ్చే ఐదేళ్లలో 15 శాతం వార్షిక రాబడి కళ్లజూడాలంటే ఈటీవీ కనీసం రూ.550 కోట్ల నికర లాభం ఆర్జించాలి. అది దాని ప్రస్తుత మొత్తం రాబడికి సమానం! అందుకని ఈ స్థాయి ఆర్జన దాదాపుగా అసాధ్యమే’’

- నిఖిల్ వోరా, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎండీ
Share this article :

0 comments: