'విజయమ్మ ధర్నాకు మద్దతునివ్వండి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 'విజయమ్మ ధర్నాకు మద్దతునివ్వండి'

'విజయమ్మ ధర్నాకు మద్దతునివ్వండి'

Written By news on Friday, July 20, 2012 | 7/20/2012

సిరిసిల్ల (కరీంనగర్), న్యూస్‌లైన్: సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగాన్ని ఆదుకోవాలన్న డిమాండ్‌తో ఈనెల 23న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తలపెట్టిన ధర్నా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం సాగించాలన్న విధానంలో భాగంగానే తాము ఈ ఆందోళనను తలపెట్టామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటుండగా సీమాంధ్ర నేతలను తెలంగాణలో అడుగు పెట్టనిచ్చేది లేదని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. బడుగు నేతన్నల పాలిట సిరిసిల్ల ‘ఉరి’సిల్లగా మారిందని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ధర్మవరం చేనేత కార్మికుల సమస్యల కోసం దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ...అదే బాటలో విజయమ్మ ధర్నా చేపట్టనున్నారని ైవైఎస్‌ఆర్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తమ ఆందోళనలో మానవీయం తప్ప రాజకీయం లేదని, అందరం కలిసి ఆత్మహత్యలకు పాల్పడకుండా నేత కార్మికులను కాపాడదామంటున్నాయి. మరోవైపు... విజయమ్మ ధర్నా వల్లనైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తమకు మేలు జరుగుతుంధని నేత కార్మిక కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
Share this article :

0 comments: