గాంధీలో టెటనస్ వైరస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గాంధీలో టెటనస్ వైరస్

గాంధీలో టెటనస్ వైరస్

Written By news on Thursday, July 19, 2012 | 7/19/2012

గాంధీ ఆస్పత్రిలో గర్భిణులకు ప్రసూతి సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రసూతి సేవలు, గర్భిణులకు పరీక్షలు నిర్వహించే లేబర్ రూమ్‌లో టెటనస్(ధనుర్వాతం) వైరస్ వ్యాపించినట్లు వైద్యులు గుర్తించడంతో బుధవారం ఈ చర్య తీసుకున్నారు. వైరస్ నిర్మూలనకు రెండు వారాలు పడుతుందని, తాత్కాలికంగా సేవలను నిలిపివేస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ మెహబూబ్ తెలిపారు. 

అత్యంత ప్రమాదకరమైన టెటనస్ వైరస్ గదిలోని గోడలు,ఫర్నిచర్ ఇతర వస్తువుల మధ్య ఉంటుంది. లేబర్ రూమ్‌కు వచ్చి వైద్యసేవలు పొందే గర్భిణులకు ఇది సోకితే పుట్టే పిల్లలకు అంగవైకల్యం, గ్రహణం మొర్రి తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులను ఇతర ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భిణులను గాంధీ ఆస్పత్రికి తీసుకురావద్దని ఇతర ఆస్పత్రులకు తరలించాలని అధికారులు 108 అంబులెన్స్‌లకు సమాచారమిచ్చారు.
Share this article :

0 comments: