సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి!

సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి!

Written By news on Wednesday, July 18, 2012 | 7/18/20122004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డికి మెండుగా నాయకత్వ లక్షణాలు ఉండటంతోపాటుగా, ప్రజల అవసరాలు తెలుసు. వాటిని వారు స్వతహాగా చెప్పుకోలేని సమాజంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని స్పందించాలన్న వైఎస్ సిద్ధాంతమే ఈ రోజున పేద సమాజాల్లో అభివృద్ధికి భరోసా ఇవ్వగలుగుతుంది. ఒక సమాజంలో సంఘర్షణ అనంతరం ఎలాంటి నాయకత్వం అవసరమో తెలివైన ప్రజలు ఎలా స్పందిస్తారో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వాతావరణం కళ్లముందుంచుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వ లక్షణాలు, నిరంతరం ప్రజల్లో ఉండే స్వభావం, పట్టుదల, నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నయినా ఎదుర్కోగల స్థైర్యం... ఇవే మన రాష్ట్రంలో ఆయన్ను ప్రజా నాయకుడిగా ఆకాశం ఎత్తుకు పెంచాయి.

సంఘర్షణ అన్న పదాన్ని అంతర్జాతీయ సమాజం ఎలా నిర్వచిస్తుంది? ప్రపంచ చరిత్ర ను ప్రభావితం చేసిన రెండో ప్రపంచ యుద్ధం తరవాత ‘పోస్ట్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ డెవలప్‌మెంట్’ అనే అంశం మీద చాలా సాహిత్యం వచ్చింది. సంస్థలే పుట్టాయి. బ్రెట్టన్ వుడ్స్‌లో అంతర్జా తీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (వరల్డ్ బ్యాంక్) అనే రెండు యుద్ధానంతర పునర్ నిర్మాణసంస్థలు ఆవిర్భవించాయి. ఇప్పుడు అలాంటి పునర్నిర్మా ణం జరుగుతోందా? జరగాల్సిన అవసరం ఉందా? అసలిప్పుడు కాన్ ఫ్లిక్ట్ ఉందా? దేన్ని సంఘర్షణగా నిర్ణయించాలి? అనేకానేక సామాజిక, ఆర్థిక, రాజకీయ సంఘర్షణల్లో పరిష్కారాలు దేనికి వెతకాలి? అభివృద్ధికి ముందు జరిగే సంఘర్షణ, సంఘర్షణ తరవాత జరిగే అభివృద్ధి అనేవి ప్రస్తుత సమాజాల్లో ఎలా చోటు చేసుకుంటున్నాయి? ఇవన్నీ అంతర్జా తీయ వేదికలమీద అనేకసార్లు చర్చకు వచ్చిన అంశాలే. జెనీవాలో గ్లోబల్ హోప్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ నిర్వహించిన సదస్సుకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినప్పుడు నా మనసులో మెదిలిన భావాలివి.

‘‘పోస్ట్ కాన్‌ఫ్లిక్ట్ లీడర్‌షిప్-పబ్లిక్ పాలసీ ఇన్ ఏ ఛేంజింగ్ వరల్డ్’’ అనే అంశం మీద దాదాపు 30 దేశాల ప్రతినిధులు పాల్గొన్న సమా వేశంలో వ్యక్తమైన భావాలను గమనిస్తే, నిరంతరం సంఘర్షించే సమా జాలు-ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారుతున్న పరిణామాలు... ఇవే నేడు ప్రపంచమంతా కనిపిస్తున్నాయి. అమెరికా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, స్థానిక నాయకత్వాల పుట్టుకనుంచి అభివృద్ధి వరకు అనేక అంశాలను శాసిస్తున్న పదం - సంఘర్షణ.

అభివృద్ధికన్నా ఆటంకాలే ఎక్కువ

వ్యక్తులు, వ్యక్తులు నిర్మించుకున్న సంఘాలు, వ్యవస్థలు నిరంతరం తమ ప్రయోజనాలు-అభివృద్ధి కోసం సంఘర్షిస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు విధానపరంగా అభివృద్ధికి బాటలు వేయగలగాలి. వెనకబాటు, ఛాందసత్వం, సామాజిక అసమానతలు, ఆర్థిక తారతమ్యాలు తీవ్రంగా ఉన్న సమాజాలలో అభివృద్ధికి అవకాశాల కంటే ఆటంకాలే ఎక్కువగా ఉంటాయి. ఈ అంశాలన్నిం టినీ ఐక్యరాజ్యసమితి పరిగణనలోకి తీసుకున్నట్టు కనపడుతుంది. 2000 సంవ త్సరంలో, కొత్త సహస్రాబ్ది ప్రారంభ సందర్భంగా సమితి కొన్ని లక్ష్యాలను ప్రపంచం ముందుంచింది. మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌కి సంబంధించి స్థానిక నాయకత్వాల సరళిని విశ్లేషించేందుకే జెనీవా సమావేశం జరిగింది.

ఐక్యరాజ్య సమితి నోట అంబేద్కర్ ఆశయాలు

సమావేశంలో హాజరుకు ముందు మనచుట్టూ ఉన్న పరిస్థితులమీద కొంత అధ్యయనానికి వీలుకలిగింది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను పరిశీలిస్తున్న ప్పుడు నాయకత్వం, నాయకత్వ లోపం అన్నవి మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రజల బతుకుల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నదీ అర్థమైంది. అంబేద్కర్ నేతృ త్వంలో రాసిన రాజ్యాంగంలోని అంశాలే ఆ మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అనిపించాయి. సంఘర్షణ అన్నది సమాజంలో ఉన్నప్పుడు దానినుంచి పుట్టిన నాయకత్వం ఎంత బలంగా ప్రవర్తించగలుగుతుందన్న అంశంమీద జెనీవాలో చర్చ జరుగుతున్నప్పుడు నా దృష్టి మన రాష్ట్ర రాజకీయ పరిణామాలపై లగ్నై మెంది.

సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా పరిశీలించినట్లయితే... దుర్భర దారిద్య్రంతో, ఆకలితో అల్లాడుతున్న ప్రజల సంఖ్యను సగానికి తగ్గిం చటం; నూటికి నూరు శాతం మందికి ప్రాథమిక విద్యను అందించటం; స్త్రీ పురుష అసమానతలను తగ్గించి మహిళల సాధికారతను ప్రోత్సహించటం; శిశు మరణాల రేటును తగ్గించటం; మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటం; హెచ్.ఐ.వి./ఎయిడ్స్, మలేరియా వంటి వ్యాధుల బారినపడకుండా కాపా డటం; పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం; అభివృద్ధికి బాటలు పరిచేలా గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌ను తయారు చేసుకోవటం- ఇవీ స్థూలంగా ఎనిమిది లక్ష్యా లు. ఈ లక్ష్యాలను చేరుకోవటంలో ఎక్కడున్నాం మనం అని అభివృద్ధి చెందిన దేశాల గణాంకాలతో పోల్చుకుంటే నిరాశ కలుగుతుంది.

అభివృద్ధి అన్నది హఠాత్తుగా జరిగే ప్రక్రియ కాదన్నది ఎవరైనా అంగీకరిస్తారు. మన రాష్ట్ర సమ కాలీన అంశాలను; వాటితోపాటు సామాజిక-ఆర్థిక-రాజకీయ అంశాలను పరి గణనలోకి తీసుకున్నప్పుడు ఈ లక్ష్యాలను అమలుచేయటంలో నాయకత్వ సం కల్పం, ప్రభుత్వ బాధ్యత అన్నవి ఎంత కీలకమైనవో అర్థమవుతుంది.

ఐదు రంగుల సిద్ధాంతం

దేశాలనుబట్టి, జాతులను బట్టి, శరీరవర్ణాన్ని బట్టి నాయకత్వ లక్షణాలు నిర్థా రణ అవుతాయా? అవుననే వాదన ఒకటి నాకు జెనీవాలో వినిపించింది. బ్లాక్, వైట్, ఎల్లో, రెడ్, గ్రీన్‌గా మనుషుల్ని విభజించి ఆయా సమాజాలను విశ్లేషిం చారు. నిజానికి చరిత్రలో మనకు తెల్లవాళ్లు-నల్లవాళ్లు అనే భావన మాత్రమే తెలుసు. పాలకులు తెల్లవాళ్లయితే, పాలితులు నల్లవాళ్లు అనేది స్వాతంత్య్రం పొందక ముందు వరకు, లేదా రెండో ప్రపంచయుద్ధం ముగిసే వరకు విశ్వ మంతా వినిపించిన ఒక దుర్మార్గమైన అభిప్రాయం.

అయితే, ఈ రోజున ఒక అంతర్జాతీయ ఫోరంలో ఇలా రంగును బట్టి నాయకత్వ లక్షణాలను చర్చిం చటం సాహసమనే చెప్పాలి. రెండో ప్రపంచయుద్ధం తరవాతి పరిణామాల్లో రెండు బలమైన దేశాలు అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, తదితర పరిణామాలు; ఆ తరవాత సోవియట్ యూనియన్ విచ్ఛి న్నం, తదనంతర పరిణామాల్లో అనేక కూటములుగా విడిపోయిన ప్రపంచం, ప్రత్యేకించి ఐరోపా సమాఖ్య ఆవిర్భావం... ఇదే సందర్భంలో ఎల్‌పీజీగా చెపు తున్న లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్- ఈ మూడింటి పర్యవ సానాలు ఐదు రంగుల నాయకత్వ సిద్ధాంతాన్ని సమర్థించేవే. అందులో మనం బలహీనమైన నాయకత్వ లక్షణాలతో ‘బ్లాక్’ కేటగిరీలో ఉన్నాం. మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి, సంక్షేమాల కోసం ఏ నాయకత్వంతో జతకట్టాలో ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలో బేరీజు వేసినప్పుడు నాకు అనిపించింది... నాయ కత్వ లేమితో మనం ఎంతగా సతమతం అవుతున్నామో!

మనుషుల్ని మనుషులుగా చూస్తేనే నాయకత్వం

అలాగని మనది బలహీనమైన నాయకత్వమే నిరంతరంగా ఉన్న సమాజమా అంటే కానే కాదు. కాకపోతే ప్రజల్ని మనుషులుగా చూడగల నాయకత్వం ఉంటే సత్ఫలితాలు వస్తున్నాయి. లేదంటే సమాజం మళ్లీ సంఘర్షణలోకి, వెను కబాటులోకి జారిపోతోంది. అభివృద్ధి నిలబడటం లేదు. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రను కూడా 1950ల నుంచి చూడవచ్చు. అలాగే, ఇటీవలి కాలాన్ని తీసుకుంటే, ఒక దశాబ్దంలో మన రాష్ట్రంలో నాయకత్వం అనుసరించిన విధానాలను విశ్లేషించవచ్చు. ఇందులో 2002 నాడు దుర్భరమైన కరవుకాటకాలు తాండవించాయి. అయితే ఈ సమాజంలో ఉన్న ప్రజ లను మనుషులుగా చూసి వారికి కావాల్సిన అండదండలు అందించే నాయకత్వం అధికారంలో ఉన్న వ్యక్తుల్లో లేకపోవటమన్నది ఆ రోజున ప్రధాన లోపం. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవా అంటే, ఉన్నాయనే చెప్పాలి. కానీ లేనిది విజన్. ఎప్పుడో 2020 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేస్తాను కాబట్టి ఈ రోజున పస్తులుండి త్యాగాలు చేయండంటే ఏ సమాజమూ అంగీకరించదు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి నాయక త్వాన్ని తిరస్కరించారు.

2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డికి మెండుగా నాయకత్వ లక్షణాలు ఉండటంతోపాటుగా, ప్రజల అవసరాలు తెలుసు. వాటిని వారు స్వతహాగా చెప్పుకోలేని సమాజంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని స్పందించాలన్న వైఎస్ సిద్ధాంతమే ఈ రోజున పేద సమాజాల్లో అభివృద్ధికి భరోసా ఇవ్వగలుగుతుంది. మళ్లీ ఈ రోజున మన రాష్ట్రంలో తీవ్రమైన రెండు సంక్షోభాలు ఒకేసారి కనిపిస్తున్నాయి. అందులో మొదటిది దూరదృష్టిగల నాయకత్వ లక్షణాలకు సంబంధించినది. రెండోది అధికారంలో ఉన్న వ్యక్తులు సమాజం అవసరాలను చూస్తున్నారా... లేక అధికార అవసరాలతోనే పాలన కొనసాగిస్తున్నారా అన్నది. ఈ రెండు సంక్షోభాలూ ఒకేసారి వచ్చాయి కాబట్టే ప్రజలంతా ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం చూస్తున్నారు.

ఒక సమాజంలో సంఘర్షణ అనంతరం ఎలాంటి నాయకత్వం అవసరమో తెలివైన ప్రజలు ఎలా స్పందిస్తారో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వాతావరణం కళ్లముందుంచుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వ లక్షణాలు, నిరంతరం ప్రజల్లో ఉండే స్వభావం, పట్టుదల, నమ్మిన సిద్ధాంతం కోసం దేన్నయినా ఎదుర్కోగల స్థైర్యం... ఇవే మన రాష్ట్రంలో ఆయన్ను ప్రజా నాయకుడిగా ఆకాశం ఎత్తుకు పెంచాయని నేను సదస్సులో వివరించాను. 30 దేశాల ప్రతినిధులు జగన్ ఫొటోను చూసి... ఇతని వయసెంత? ఇతని విద్యార్హతలేమిటి? పార్టీ ఏమిటి? అంటూ ప్రశ్నలు అడిగారు. ప్రజల అండదండలతో ఏటికి ఎదురీదుతూ ఈ మధ్యే ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని వారికి విన్నవించాను. ఈ విజయానికి కారణం రెండున్నరేళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు నిశితంగా, సమీపంగా జగన్‌ను గమనించటమే. అతడిని ఎందరు ఎన్ని రకాలుగా విమర్శించినా, ఇబ్బందులకు గురిచేస్తున్నా... జైలులో పెట్టినా ఈ పరీక్షల న్నింటికీ నిలబడ టమే వారిని ఆకట్టుకున్న అంశం. ఒక్కమాటలో చెప్పాలంటే, సామాజికంగా- ఆర్థికంగా తమకు కావాల్సిన పునాది ఈ నాయకుడి ద్వారా మాత్రమే లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇలాంటి విశ్వాసమే గతంలో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్‌కు 2004లో మహా విజయాన్ని కట్టబెట్టింది.

మంచి ప్రభుత్వానికి నిర్వచనం

ప్రపంచ సమాజమే మనుషుల్ని రంగులవారీగా చిత్రీకరిస్తున్నప్పుడు, భారతీ యులు నాయకత్వ లక్షణాల్లో అంత బలహీనులా? ఇది కావాలని వేస్తున్న ముద్రా లేక ఇందులో ఏ కొంచెమైనా నిజం ఉందా అన్న అభిప్రాయం కలి గింది. అదే సమయంలో, ఈ నాటికీ ఈ సమాజం దళితులకు దక్కుతున్న అవ మానాలను, ఇబ్బందులను గమనిస్తున్నప్పుడు; హత్యాకాండను, అత్యాచారా లను ఎదుర్కొంటున్నప్పుడు; విధానపరంగా దళితులకు ఏదో మేలు చేస్తు న్నట్టు ప్రభుత్వాలు చెప్పుకుంటున్నా, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఐక్యరాజ్య సమితి బీదరికం లెక్క అయిన ఒక డాలరు కంటే తక్కువ ఆదాయంతో బతుకు ఈడుస్తున్న విషయం కనిపిస్తున్నప్పుడు... పబ్లిక్ పాలసీ ఎలా ఉండాలి అన్న ప్రశ్న ఎంత సహేతుకమో అర్థమవుతోంది. గుడ్ గవర్నెన్స్ లేకపోవటంవల్ల, అధికారంలో ఉన్న నాయకులకు చిత్తశుద్ధి లోపించటం వల్ల మిగతా దేశాలతో పోల్చినప్పుడు మనం వెనకబడి ఉన్నామన్నది స్పష్టమవుతోంది. అంబేద్కర్, ఐక్యరాజ్య సమితి చెప్పినవి ప్రజావసరాలకు సంబంధించి అధికారంలో ఉన్న వారు నెరవేరాల్చిన మౌలికాంశాలు. వీటిని గాలికి వదిలేసి ప్రజలకు ఏం కావా లన్నది అర్థం చేసుకోలేని నాయకత్వాలు పరిష్కారాల్లో కాక, సమస్యలో భాగం గా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను చూస్తుంటే ఆ అభిప్రాయం మరింత బల పడుతోంది. కాబట్టే మరో సామాజిక సంఘర్షణ కొత్త నాయకత్వానికి పురుడుపోసింది. 
Share this article :

0 comments: