రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు

రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు

Written By news on Saturday, July 21, 2012 | 7/21/2012

సిరిసిల్ల రూరల్ (కరీంనగర్), న్యూస్‌లైన్: సిరిసిల్ల నేతన్నల సమస్యలపై వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో ధర్నా చేయడానికి వస్తే అడ్డుకోవడం సరికాదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల మండలం రాళ్లపేట, ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామాల్లో శుక్రవారం ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయమ్మ పర్యటనను తెలంగాణ వాదంతో ముడిపెట్టొద ్దన్నారు. నేతన్నల సమస్యపై స్పందించి వస్తుంటే అడ్డుకుంటామనడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ నాయకులు పునరాలోచించి విజయమ్మ ధర్నాను అడ్డుకోవద్దని కోరారు. పేదోడి ప్రతీ గుండెలో, ప్రతీ ఇంటిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, అందుకే ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. 

రాజకీయ ప్రయోజనాలకే రాద్ధాంతం: భాస్కర్

వైఎస్ విజయమ్మ ధర్నాను అడ్డుకోవాలంటూ టీఆర్‌ఎస్ నాయకులు రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని పద్మశాలి జా తీయ పరిషత్ అధ్యక్షుడు కొక్కుల భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని తెచ్చేది లేదు.. రాజకీయాన్ని వదిలేది లేదన్నట్లుగా టీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. విజయమ్మ ధర్నా ద్వారా నేతన్నలకు ఎంతో కొంత మేలే జరుగుతుందన్నారు. సిరిసిల్లలో చేనేత శిల్పి పరంధాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే కేటీఆర్ ఆ హామీని విస్మరించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం చూస్తుంటే నేతన్నలపై ఆయనుకున్న ప్రేమ ఏమిటో ఇట్టే అర్థమవుతుందన్నా. సిరిసిల్ల నేతన్నలు వాస్తవాలను గుర్తించి విజయమ్మకు స్వాగతం పలకాలని ఆయన కోరారు.

వైఎస్సార్సీపీ ఇంటింటి ప్రచారం

విజయమ్మ ధర్నాను విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని సాయినగర్, ఇందిరానగర్, బీవైనగర్‌లో ప్రచారం నిర్వహించారు. మహిళలను గౌరవించే తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పాలని, విజయమ్మకు స్వాగతం పలకాలని ఆయన కోరారు. కార్మికుల సమస్యలపై సర్కారు కళ్లు తెరిపించేందుకే విజయమ్మ ధర్నా చేస్తున్నారని వివరించారు. ధర్నా పోస్టర్‌ను వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ ఆవిష్కరించారు. కాగా, వైఎస్సార్ యువజన విభాగం ఆధ్వర్యంలో విజయమ్మ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధర్నాకు సహకరించాలని కోరారు. 

కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్: విజయమ్మ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను శుక్రవారం ఓయూ లా కళాశాల వద్ద ఎదుట దహనం చేశారు. వైఎస్సార్ ఎస్‌యూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు టి రాహుల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ కోసం ఆత్మత్యాగాలకు పాల్పడిన అమరుల కుటుంబాలను కేటీఆర్ ఏనాడు పరామర్శించిన పాపాన పోలేదని రాహుల్‌రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. 
Share this article :

0 comments: