టీడీపీ అధినేతకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సవాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ అధినేతకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సవాల్

టీడీపీ అధినేతకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సవాల్

Written By news on Friday, July 20, 2012 | 7/20/2012



హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో కుమ్మక్కవుతున్నది తెలుగుదేశం పార్టీయేనని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఇలా అనేక సందర్భాల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి కుట్రలకు దిగినది చంద్రబాబేనని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలతో జగన్‌పై కేసు మోపి జైలుపాలు చేయించిందని, దీనివెనుక ఆ పార్టీ పెద్దల హస్తముందని ఆరోపించారు. వారి ఆదేశానుసారమే సీబీఐ నడుస్తూ వైఎస్ జగన్‌ను వేధిస్తోందని విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘తాను ఏ పార్టీకి సంబంధించినవాడినీ కాదని ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. ఓటుహక్కు వినియోగించుకోవడం ప్రజాప్రతినిధుల కనీసధర్మం. చంద్రబాబు ఆ ధర్మాన్ని నెరవేర్చకుండా ఎన్నికలకు దూరంగా ఉండడం సిగ్గుచేటు’’ అని అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. 

ప్రణబ్‌పై బాబు పొగడ్తలను జనం మరిచిపోలేదు: శోభానాగిరెడ్డి

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కే ఓటువేస్తామన్న అభిప్రాయాన్ని చంద్రబాబు, ఎర్రంనాయుడు పలుమార్లు మీడియా ముందు ప్రకటించారని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. మతతత్వ బీజేపీని సమర్థించే సంగ్మాకన్నా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ప్రణబ్‌కు ఓటువేయడమే మేలని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ఓటువేయని వాడు చనిపోయిన వాడితో సమానమని ఊకదంపుడు ప్రచారాలు సాగించిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు ఇపుడు ఓటింగ్‌కు దూరంగా ఉండడాన్ని ఎలా సమర్థించుకుంటారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారరెడ్డి ప్రశ్నించారు.

వైఎస్సార్ సీపీ నిర్ణయం సరైనదే: గాదె

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటువేయడం సరైన నిర్ణయమని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని టీడీపీ అనడం అర్థరహితమని ఖండించారు. 
Share this article :

0 comments: