ఓటు హక్కు వినియోగించుకున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటు హక్కు వినియోగించుకున్న జగన్

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్

Written By news on Thursday, July 19, 2012 | 7/19/2012

రాష్ట్రపతి ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు వేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పదకొండున్నర సమయంలో చంచల్‌గూడ నుంచి బయలు దేరిన ఆయన 12గంటలకు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న జగన్‌కు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు స్వాగతం పలికారు. పలువురు ఇతర పార్టీ నేతలు కూడా ఆయనను పలకరించారు. అందరికి అభివాదం చేసిన జగన్‌ ఓటు వేసిన అనంతరం చంచల్‌గూడ జైలుకు వెళ్లిపోయారు.

కాగా శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తొలి ఓటును వినియోగించుకోగా, ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి ఓటు వేస్తున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటామని టీడీపీ ప్రకటించగా, రాష్ట్రపతి ఎన్నికపై టీఆర్ఎస్ తన వైఖరిని ప్రకటించలేదు. కాగా ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణను అధికారులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు.
Share this article :

0 comments: