గొర్రెల కాపరుల కోసం 103: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » గొర్రెల కాపరుల కోసం 103: షర్మిల

గొర్రెల కాపరుల కోసం 103: షర్మిల

Written By news on Wednesday, November 14, 2012 | 11/14/2012

http://ysrcongress.com/news/news_updates/gorrela_kaaparula_kOsaM_103__sharmila.html

గొర్రెల కాపరుల కోసం ప్రత్యేకంగా 103  మొబైల్ వెటర్నరీ సర్వీసును ప్రవేశపెడతామని మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన వైయస్ షర్మిల చెప్పారు. 28వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంలో గొర్రెల కాపరులతో పాటు వలస కూలీలు కూడా ఆమెను కలిశారు. తమతమ ప్రాంతాలలో పని లభించకనే హైదరాబాద్, బెంగళూరు నగరాలకు తరలి వెడుతున్నట్లు వారు ఆమెకు చెప్పారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందనీ, మీకు మంచి రోజులు తథ్యమనీ ఆమె వారికి తెలిపారు. గొర్రెలకు మందులు, వైద్యం లభించక ఇబ్బంది పడుతున్నామని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: