నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

Written By news on Thursday, November 15, 2012 | 11/15/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. షర్మిల జిల్లాలోకి ప్రవే శించి బుధవారం నాటికి ఏడు రోజులవుతోంది. ఇప్పటి వరకు 84 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. 

29వ రోజు ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగ ంగా 14.6 కిలోమీటర్ల మేర షర్మిల నడవనున్నట్లు పార్టీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రంగాపురం శివారు నుంచి గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభమవుతందని వారు పేర్కొన్నారు. చిన్నకడబూరు, పెద్దకడబూరు మీదుగా దొడ్డిమేకల చేరుకుంటుందని వారు వివరించారు. మండలకేంద్రమైన పెద్దకడబూరులో బహిరంగసభ ఉంటుందన్నారు.
Share this article :

0 comments: