మైనార్టీలో కిరణ్ సర్కార్: శోభా నాగిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మైనార్టీలో కిరణ్ సర్కార్: శోభా నాగిరెడ్డి

మైనార్టీలో కిరణ్ సర్కార్: శోభా నాగిరెడ్డి

Written By news on Monday, November 12, 2012 | 11/12/2012

ఎంఐఎం మద్దతు ఉపసంహరణతో మైనార్టీలో పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజావిశ్వాసం లేని ప్రభుత్వానికి సంఖ్యా బలం కూడా తగ్గిందని ఆమె సోమవారమిక్కడ అన్నారు. కిరణ్‌ సర్కార్‌ తక్షణమే బలనిరూపణ చేసుకోవలసిందిగా గవర్నర్‌ ఆదేశాలు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున శోభానాగిరెడ్డి డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న సమయంలో అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వం మైనార్టీలో పడ్డా కూడా ముందుకు రాకపోవడం శోచనీయమని శోభానాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ప్రజలు వేచి చూస్తున్నారని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు
Share this article :

0 comments: