బాలల దినోత్సవంలో పాల్గొన్న షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » బాలల దినోత్సవంలో పాల్గొన్న షర్మిల

బాలల దినోత్సవంలో పాల్గొన్న షర్మిల

Written By news on Wednesday, November 14, 2012 | 11/14/2012

బాలల దినోత్సవం వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు. ఆదోని ఆర్ట్స్‌ కాలేజీ పక్కన ఉన్న మల్లికార్జు పాఠశాలలో బాలల దినోత్సవంలో ఆమె పాలుపంచుకున్నారు. చిన్నారులతో ముచ్చటించి వారికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి కేక్‌ కట్‌ చేశారు. '28వ రోజు మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ఆదోని నుంచి మొదలైంది. ఈ పాదయాత్ర రంగాపురం దాకా కొనసాగుతుంది. షర్మిల పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై.వీ.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఆదోనిలో షర్మిలను బుధవారం గొర్రెల కాపర్లు కలిశారు. ప్రస్తుత ప్రభుత్వం గొర్రెలకు మందులు, బీమా ఇవ్వటం లేదని వారు తమ గోడును చెప్పుకున్నారు. తమను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాజన్న రాజ్యం వచ్చాక 103 మొబైల్ వెటర్నరీ సర్వీసులను అందిస్తామని హామీ ఇచ్చారు.

source:sakshi
Share this article :

0 comments: